అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి..!

అమెరికాలో ఉపాధి, ఉద్యోగాల కోసం నిత్యం వేలాది మంది అమెరికాకు వెళ్తుంటారు. అగ్రరాజ్యంలో ఉద్యోగాలు సంపాదించి అక్కడే సెటిల్ అయి తమ కలలను నెరవేర్చుకోవాలని చూస్తుంటారు. అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి 3,31,600 మందికి పైగా విద్యార్థులు అమెరికాలో ఉన్నారు.

వివిధ నివేదికల ప్రకారం అమెరికాలో విదేశీ లేదా తెలుగు విద్యార్థుల శాతం 12.5 నుంచి 51 శాతంకుపైగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలోని ఫ్లోరిడాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో నిజామాబాద్ శివారులోని గూపన్ పల్లికి చెందిన రాహుల్ ఉన్నారు. అతను ఎంఎస్ చదివేందుకు 3 నెలల క్రితమే అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలు.. మిగతా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఆ యువకులు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీకొట్టింది. దాంతో అక్కడికక్కడే ఆ ముగ్గురూ దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్ గా గురించారు. రాహుల్ మూడు నెలల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక రాహుల్ మరణ వార్త విని అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే మిగతా ఇద్దరి వివరాలు ఇంకా తెలియలేదు.

US accident 3 youths killed Horrific road accident in the US Three youths from Telangana killed

ఇక ఇదే విషయంపై రాహుల్ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. తన కుమారుడిది ఎంఎస్ అయిపోయిందని.. సౌత్ ఫ్లోరిడాలోని పీహెచ్ డీ చేయాలని అమెరికాలోనే ఉండిపోయాడని అన్నాడు. ఉదయం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. కారులో మొత్తం ముగ్గురు ఉండగా.. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారని.. రాహుల్ ఈరోజు చనిపోయినట్లు తెలిసిందని విలపించారు. తమ కుమారుడి మృత దేహాన్ని త్వరగా ఇక్కడకు రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+