హైదరాబాద్‌కు హాలీవుడ్ డ్రీమ్‌వర్క్స్: సీఈఓ జెఫ్రీతో కెటిఆర్(పిక్చర్స్)

లాస్ఏంజెల్స్/హైదరాబాద్: హాలీవుడ్‌ అగ్రశ్రేణి ప్రొడక్షన్‌ కంపెనీ డ్రీమ్‌వర్క్స్‌ తెలంగాణలో ప్రవేశిస్తోంది. భారత్‌లో తమ కంపెనీని విస్తరించాలనుకుంటున్న డ్రీమ్‌వర్క్స్‌ తెలంగాణలో ప్రభుత్వ భాగస్వామ్యంతో చిన్నతరహా థీమ్‌సెంటర్‌, డ్రీమ్‌ప్లేను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు ఈ మేరకు డ్రీమ్‌వర్క్స్‌తో సూత్రప్రాయంగా అంగీకారం కుదుర్చుకున్నారు.

హైదరాబాద్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎకో సిస్టమ్ థియేటర్‌ను నిర్మిస్తామని ప్రకటించింది. కాగా, ఐదోరోజు పర్యటనలో కేటీఆర్‌ లాస్‌ఏంజిల్స్‌లోని డ్రీమ్‌వర్క్స్‌ కార్యాలయాన్ని సందర్శించి, సీఈవో జెఫ్రీ కాట్జన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలను జెఫ్రీకి కేటీఆర్ వివరించారు.

భారత్‌లో సినిమా నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాలను విస్తరించే ఆలోచనలు ఉన్నాయన్న జెఫ్రీ.. సమర్థ నాయకత్వంలో ముందుకెళుతున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు.

తమ దీర్ఘకాలిక ప్రణాళికల అమలులో ప్రభుత్వ భాగస్వామ్యం కోరుతున్నామన్నారు. తమ సినిమాల ప్రమోషన్‌కోసం హైఎండ్ ఎకో సిస్టమ్‌తో ఒక థియేటర్ కూడా నిర్మిస్తామని, అందుకు సహకరించాలని మంత్రిని కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్, చేతనైనంత సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అంతర్జాతీయ స్థాయిలో త్వరలో హైదరాబాద్‌లో నిర్మించే ఫిల్మ్‌సిటీ.. డ్రీమ్‌వర్క్స్ విస్తరణకు అత్యంత అనుకూలంగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఇక పర్యాటకులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో డ్రీమ్ ప్లే అనే చిన్న తరహా థీమ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, డ్రీమ్‌వర్క్స్ ఈ సమావేశంలో నిర్ణయించాయి. భారత మార్కెట్ అవసరాలు, స్థానిక నైపుణ్యాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్‌కు రావాలని జెఫ్రీని మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.

అనంతరం లాస్‌ ఏంజిల్స్‌లోని ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఐ-హబ్‌ ఇంక్యుబేటర్‌ను కేటీఆర్‌ సందర్శించారు. నీటి సంరక్షణతో పాటు మురుగునీటి శుద్ధిలో వినూత్నమైన పద్ధతులు పాటిస్తున్న ఐ-హబ్‌ పనితీరును అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని టీహబ్‌తో కలసి పనిచేయాలని వారిని కోరారు. ఐహబ్‌ సీఈవోను హైదరాబాద్‌కు ఆహ్వానించారు.

జెఫ్రీతో మంత్రి కెటిఆర్‌

జెఫ్రీతో మంత్రి కెటిఆర్‌

హాలీవుడ్‌ అగ్రశ్రేణి ప్రొడక్షన్‌ కంపెనీ డ్రీమ్‌వర్క్స్‌ తెలంగాణలో ప్రవేశిస్తోంది.

జెఫ్రీతో మంత్రి కెటిఆర్‌ సమావేశం

జెఫ్రీతో మంత్రి కెటిఆర్‌ సమావేశం

భారత్‌లో తమ కంపెనీని విస్తరించాలనుకుంటున్న డ్రీమ్‌వర్క్స్‌ తెలంగాణలో ప్రభుత్వ భాగస్వామ్యంతో చిన్నతరహా థీమ్‌సెంటర్‌, డ్రీమ్‌ప్లేను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

జెఫ్రీతో మంత్రి కెటిఆర్‌

జెఫ్రీతో మంత్రి కెటిఆర్‌

పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికా పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె తారకరామారావు ఈ మేరకు డ్రీమ్‌వర్క్స్‌తో సూత్రప్రాయంగా అంగీకారం కుదుర్చుకున్నారు.

మంత్రి కెటిఆర్

మంత్రి కెటిఆర్

హైదరాబాద్‌లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎకో సిస్టమ్ థియేటర్‌ను నిర్మిస్తామని ప్రకటించింది. కాగా, ఐదోరోజు పర్యటనలో కేటీఆర్‌ లాస్‌ఏంజిల్స్‌లోని డ్రీమ్‌వర్క్స్‌ కార్యాలయాన్ని సందర్శించి, సీఈవో జెఫ్రీ కాట్జన్‌తో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+