అమెరికా వీసా సేవలు నిలిపివేత - ఎప్పటి వరకు..!!

దేశవ్యాప్తంగా వీసా సేవలను ఈ నెల 28వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలిపింది. ప్రస్తుతం అందిస్తున్న ఈ సేవల కోసం వినియోగిస్తున్న వ్యవస్థ (స్లాట్ ఫామ్)ను మరింత అధునాతనంగా మార్పు (అప్ డేట్) చేసేందుకు బుధవారం నుంచి శుక్రవారం వరకు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నెల 28వ తేదీ వరకు (శుక్రవారం) వరకు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొంది. దేశ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు చెప్పింది, వీసా ఫీజు చెల్లింపులు, ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్స్ తదితర అన్ని సేవలు శనివారం నుంచి యథావిధిగా అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. కస్టమర్ ఈ -మెయిల్ ఐడీ కూడా మారుతుందని పేర్కొంది శనివారం నుంచి [email protected] కాన్సుల్ కార్యాలయాలను సంప్రదించ వచ్చని తెలిపింది.

US Embassies Suspended Visa Services Across the Country for two days upto 28th July

మార్పులకు సంబంధించిన మరింత సమాచారం కోసం https://www.ustraveldocs.com/వెబ్‌సైట్‌ను చూడవచ్చు అని వివరించింది. శనివారంలోగా అత్యవసరంగా వీసాలు, ఇతర సేవలు కావాల్సిన వారు Hydcons [email protected] లేదా [email protected] మెయిల్స్‌లో సంప్రదించవచ్చని అమెరికన్‌ కాన్సులేట్‌ ట్వీట్‌లో పేర్కొంది. రెండు రోజుల పాటు నిలిచే ఈ సేవలను తిరిగి శనివారం నుంచి యధావిధిగా పునరుద్దించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+