షాక్: నోట్ల మార్పిడికి చిన్న పిల్లలను లైన్లలో నిలబెడ్తున్న దళారులు
హైదరాబాద్ నగరంలోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట చిన్న పిల్లలతో కొందరు దళారులు నోట్లు మార్పించడం కనిపించింది.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు చిల్లర కోసం కష్టాలు పడుతుంటే.. కొందరు దళారులు మాత్రం నోట్ల మార్పిడి కోసం అనేక దారులు వెతుకుతున్నారు. తాజాగా, చిన్న పిల్లలను కూడా నోట్ల మార్పి కోసం ఉపయోగించుకోవడం వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నగరంలోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట చిన్న పిల్లలతో కొందరు దళారులు నోట్లు మార్పించడం కనిపించింది. చిన్న పిల్లలకు పెద్ద నోట్లు అప్పగించి వాటిని బ్యాంకులో ఇచ్చి కొత్త నోట్లను తెప్పించుకుంటున్నారు.

చిన్న పిల్లలకు వారి ఆధార్ కార్డులను ఇచ్చి మరీ ఆర్బీఐ కార్యాలయానికి పంపించడం గమనార్హం. పిల్లలతో ఇలా తమ పెద్ద పాత నోట్లను మార్పించుకునే వారి సంఖ్య పెరగడంతో పిల్లలను అందించేందుకు కూడా దళారులు కొత్త వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
కాగా, కొందరు దళారులు బ్యాంకులకు వెళ్లి నోట్లను ఒక్కసారి తీసుకుంటే చేతి వేలిపై వేసే ఇంక్‌ను తొలగించే వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. చాలా మంది బ్యాంకులో నగదు మార్పిడి చేసుకున్న వారు.. మరోసారి డబ్బులు తీసుకునేందుకు వీలుగా వీరి వద్దకు వచ్చి ఇంక్‌ను తొలగించుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications