హీరో మహేష్ బాబును కలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్
డెహ్రాడూన్: సూపర్ స్టార్ మహేష్ బాబును ఉత్తర ఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కలిశారు. మహేష్ బాబు తన 25వ సినిమా షూటింగ్ కోసం ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకులు. పూజా హెగ్డే కథానాయిక.
సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందుకోసం మహేష్ బాబు డెహ్రాడూన్ సినిమా సెట్‌కు చేరుకున్నారు. ఈ సినిమా సెట్‌కు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కూడా వచ్చారు. ఆయన మహేష్ బాబుతో కాసేపు మాట్లాడారు.

మహేష్ బాబు, దర్శకులు వంశీ పైడిపల్లిలను కలిసి డెహ్రాడూన్‌లో షూటింగ్ పూర్తయ్యే వరకు సహకరిస్తామని తెలిపారు. కాగా, మహేష్ బాబు, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రనాథ్ సింగ్‌కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.












Click it and Unblock the Notifications