అప్పుల్లో-ఆత్మహత్యల్లో తెలంగాణ నం.1, కేసీఆర్ సర్వేలు బోగస్ : ఉత్తమ్
హైదరాబాద్ : ఇటీవల వరుసగా వెలువడుతున్న పలు సర్వేలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు, ఆయన పాలనకు టాప్ మార్కులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా భోగస్ అని కొట్టిపారేస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కేసీఆర్ పాలన బాగుందంటూ వెలువడిన సర్వేలన్ని బోగస్ అని మండిపడ్డారు.

కేసీఆర్ సర్వే రాజకీయాలు చేస్తున్నారని, సర్వేల వ్యవహారమంతా అబద్ధాల పుట్టేనని విమర్శించారు. సర్వేలే గనుక నిజమైతే.. టీఆర్ఎస్ లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా ఎందుకు చేయించడం లేదని ప్రశ్నించారు. అప్పుల్లో, అన్నదాతల ఆత్మహత్యల్లో, ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. జీహెచ్ఎంసీలోను పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటుందని ఆరోపించారు.
కాగా, నేడు దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటల్‌ల జయంతిని పురస్కరించుకుని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్తమ్. ఈ సందర్బంగా ఇందిరా, సర్దార్ పటేల్ సేవల గురించి కొనియాడిన ఉత్తమ్.. పనిలో పనిగా టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications