బతుకమ్మ: మహిళలతో రోడ్డుపై విహెచ్ (పిక్చర్స్)
హైదరాబాద్: అంబర్‌పేట బతుకమ్మకుంటను కబ్జాదారుల బారి నుంచి రక్షించి, కుంటను అభివృద్ది చేయాలని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బతుకమ్మకుంట భూములను పరిరక్షించాలని కోరుతూ ఆయన ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలతో కలిసి అంబర్‌పేట శ్రీరమణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు.
ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ధర్నా చేస్తున్న విహెచ్‌ను, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లో వి.హనుమంతురావు మాట్లాడుతూ కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేయడం వల్లే బతుకమ్మకుంట అని పేరు వచ్చిందని, ఇలాంటి బతుకమ్మకుంటపై కొంతమంది కబ్జాదారులు కన్నేసి, నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి మట్టితో కుంటను పూడ్చి వేసి కబ్జా చేశారని ఆరోపించారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
కుంటను పూడ్చివేయడం వల్ల ఆడపడుచులు బతుకమ్మలను ఇళ్లలోని బకెట్లలో నిమజ్జనం చేసుకోవాలన్సిన పరిస్ధితి వచ్చిందన్నారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పందించి, బతుకమ్మకుంటను సందర్శించి అక్కడి పరిస్థితి తెలుసుకుని కుంట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
ప్రభుత్వం బతుకమ్మవేడుకల కోసం రూ.10కోట్లను కేటాయించడం అభినందనీయమన్నారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
అలాగే అంబర్‌పేట పాల్‌టెక్నిక్ వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించాలని, ఛేనెంబర్‌లో గౌతు లచ్చన్న పేరుతో నిర్మించ తలపెట్టిన ఆడిటోరియంకు మహాత్మ జ్యోతిరావుఫూలే పేరు పెట్టాలన్నారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
త్వరితగతిన ఆడిటోరియం పనులను చేపట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వీహెచ్ మహిళలతో కలిసి రోడ్డుపై బతుకమ్మ ఆడారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ జ్ఞానేశ్వర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, కాంగ్రెస్ నాయకులు డీపీరెడ్డి, జగన్మోహన్‌రావు, బాలయ్య, మహ్మద్‌గౌస్, శ్రీకాంత్‌గౌడ్, శ్రీరాములుముదిరాజ్, కొటం అనిల్‌కుమార్, సుధాకర్, కన్నా, గిరిధర్‌గౌడ్, సతీష్, హబీబ్,భూపతి లక్ష్మన్, నర్సింగ్‌ముదిరాజ్, దశరధ్, ఉమాదేవి పాల్గొన్నారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ జ్ఞానేశ్వర్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, కాంగ్రెస్ నాయకులు డీపీరెడ్డి, జగన్మోహన్‌రావు, బాలయ్య, మహ్మద్‌గౌస్, శ్రీకాంత్‌గౌడ్, శ్రీరాములుముదిరాజ్, కొటం అనిల్‌కుమార్, సుధాకర్, కన్నా, గిరిధర్‌గౌడ్, సతీష్, హబీబ్,భూపతి లక్ష్మన్, నర్సింగ్‌ముదిరాజ్, దశరధ్, ఉమాదేవి పాల్గొన్నారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ధర్నా చేస్తున్న విహెచ్‌ను, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

బతుకమ్మ కుంటను రక్షించాలంటూ ధర్మా చేస్తున్న విహెచ్
ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ ఎల్‌టీ చంద్రశేఖర్, మలక్‌పేట ఏసీపీ సుధాకర్, అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ధర్నా చేస్తున్న విహెచ్‌ను, పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Click it and Unblock the Notifications