ఇంత అసభ్యమా?: ‘అర్జున్ రెడ్డి’ని చించేసిన వీహెచ్, ‘తాతయ్యా’ అంటూ హీరో
టాలీవుడ్ తాజా సినిమా పోస్టర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఇంత అభ్యంతరకరమా? అంటూ ఆ సినిమా పోస్టర్లను చించేసి నిరసన తెలిపారు.
హైదరాబాద్: టాలీవుడ్ తాజా సినిమా పోస్టర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఇంత అభ్యంతరకరమా? అంటూ ఆ సినిమా పోస్టర్లను చించేసి నిరసన తెలిపారు. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఆ సినిమా హీరో కూడా వీహెచ్ చర్యకు స్పందించారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో జరిగిన సమావేశానికి హనుమంతరావు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళుతుండగా ఓ ఆర్టీసీ బస్సు మీద టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రానికి సంబంధించిన ఓ అసభ్యకరమైన పోస్టర్‌ను ఆయన గమనించారు.
దీంతో వెంటనే బస్సు ఆపించి కండక్టర్ సాయంతో ఆయన ఆ పోస్టర్‌ను తొలగించేశారు. ఇలాంటివి యువతను తప్పుదోవ పట్టిస్తాయని అన్నారు. డబ్బు కోసం ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలకు ఒప్పుకోకూడదని ఈ సందర్భంగా వీహెచ్ కోరారు.
ఇది ఇలా ఉండగా, వీహెచ్ పోస్టర్ చించేసిన ఫొటో వైరల్ కావడంతో.. అవి అర్జున్ రెడ్డి చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ వరకు చేరుకున్నాయి. దీంతో వీహెచ్ ఫొటోను పోస్ట్ చేసిన దేవరకొండ.. 'తాతయ్యా.. చిల్' అంటూ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications