'కేటీఆర్! ఆ విషయం ఇవాంకాకు తెలిస్తే స్టేజ్‌పైనే నిలదీసేవారు'
Recommended Video

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పక్కన, అలాగే, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ సదస్సులో పాల్గొనడంపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అంతకుముందు ఆ పార్టీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ మంత్రిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మెట్రో రైలు విషయమై మాట్లాడుతూ.. నగర మేయర్ బొంతు రామ్మోహన్‌కు వేదికపై స్థానం ఎందుకులేదని ప్రశ్నించారు. తాజాగా విహెచ్ నిలదీశారు.

ఏ హోదాతో కేటీఆర్ ప్రధాని పక్కన కూర్చున్నారు
మంత్రి కేటీఆర్ ఏ హోదాతో ప్రధానమంత్రి పక్కన కూర్చున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ప్రశ్నించారు. హైదరాబాదుకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు ప్రథమ పౌరుడైన మేయర్ స్వాగతం పలకడం ఆనవాయితీ అని, అయితే ఈసారి మేయర్ ఎక్కడా కనిపించలేదని మండిపడ్డారు.

మంత్రివర్గంలో మహిళలు లేరు గానీ గొప్పలు
రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలు లేరు గానీ, గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో మహిళా సాధికారతపై కేటీఆర్ గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని వి హనుమంత రావి విమర్శలు గుప్పించారు.

ఇవాంకాకు ఆ విషయం తెలియదు
కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేని విషయం ఇవాంక ట్రంప్‌కు తెలియదని అన్నారు. ఆ విషయం తెలిస్తే కేటీఆర్‌ను ఆమె ప్రశ్నించేవారని వ్యాఖ్యానించారు. అన్ని కార్యక్రమాల్లో కేటీఆర్ తప్ప ఇంకెవరూ కనిపించడం లేదన్నారు.

కేటీఆర్‌పై కాంగ్రెస్ విమర్శలు
కాగా, మంగళవారం మెట్రో రైలు ప్రారంభం మొదలు బుధవారం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సదస్సు వరకు అంతా కేటీఆర్ హవా కనిపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications