శుభవార్త: వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి అనుమతి

హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 3,943 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

1,191 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 685 డిప్యూటీ సివిల్ సర్జన్లు, 453 ఆర్‌ఎంవో, 562 స్టాఫ్ నర్సు ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులు మంజూరు అయ్యాయి.

Vacancies in Telangana Medical and Health will be filled up

డిసెంబర్ నెలాఖరులోగా జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, క్లర్క్‌ పోస్టులతో కూడిన గ్రూప్‌-4 ప్రకటనను టిఎస్‌పిఎస్సీ చేయనుంది. దీని కింద మొత్తం 1000 పోస్టుల వరకు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే 800 వీఆర్‌వో పోస్టులకు కూడా ప్రకటన జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పోలీసు శాఖలో 500కు పైగా పోస్టులు, 250 వసతి గృహ సంక్షేమ అధికారుల ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+