తెలంగాణలో తొలిరోజు ఎంతమందికి కరోనా వ్యాక్సిన్ వేస్తారంటే?: రెండో డోస్ మళ్లీ ఎప్పుడంటే?

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్.. ఈ వారమే అందుబాటులోకి రానుంది. సాధారణ ప్రజల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ముహూర్తాన్ని ఖరారు చేసింది. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు శ్రీకారం చుట్టబోతోన్నాయి. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా డ్రైరన్ నిర్వహించిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి.

తెలంగాణలో 139 కేంద్రాలు ఎంపిక

తెలంగాణలో 139 కేంద్రాలు ఎంపిక

కరోనా వ్యాక్సినేషన్ కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 139 కేంద్రాలను ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాల్లో రెండు నుంచి మూడు కేంద్రాలను ఈ జాబితాలో చేర్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ను నిర్వహిస్తారు. మొదటి రోజు మొత్తం 13,900 మందికి వ్యాక్సిన్ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం.. తొలి విడతలో ఫ్రంట్‌లైన్ వారియర్లకే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు సహా మొత్తం 2.90 లక్షల మంది వ్యాక్సిన్‌ కోసం పేర్లు నమోదు చేసుకున్నారు.

ఎల్లుండి వ్యాక్సిన్ రవాణా ప్రారంభం..

ఎల్లుండి వ్యాక్సిన్ రవాణా ప్రారంభం..

మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి కార్గో విమానంలో ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు రవాణా చేస్తారు. వాటిని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌లో భద్రపరుస్తారు. వ్యాక్సిన్ తరలింపు, భద్ర పర్చడంపైనా కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని అనుగుణంగా ఈ ప్రక్రియను చేపడతారు. దీనికోసం ప్రత్యేక ఇన్సులేటెడ్‌ వాహనాన్ని వినియోగించాల్సి ఉంటుంది.

రెండు వారాల పాటు తొలివిడత వ్యాక్సినేషన్..

రెండు వారాల పాటు తొలివిడత వ్యాక్సినేషన్..

ఇప్పటిదాకా తమ పేర్లను నమోదు చేసుకున్న 2.90 లక్షల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వడానికి రెండు వారాల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందించరకున్నారు. 28 రోజుల తరువాత మళ్లీ మళ్లీ రెండో డోసును వారికి అందిస్తారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వారంలో నాలుగు రోజులపాటే నిర్వహించాలని కేంద్రం ఇదివరకే సూచించింది. బుధ, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ ఉండదు.

ఫ్రంట్‌లైన్ వర్కర్లకు

ఫ్రంట్‌లైన్ వర్కర్లకు

హెల్త్ వర్కర్లకు తొలి విడత డోస్ ఇచ్చిన నాలుగు వారాల అనంతరం ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేస్తారు. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను ఈ జాబితాలోకి తీసుకొచ్చారు. అనంతరం 50 సంవత్సరాల వయస్సు పైనున్న వారికి వ్యాక్సిన్ ఇస్తారు. దీనికి అనుగుణంగా తెలంగాణకు వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+