నా ఇగోను హర్ట్ చేయకు, సైలెంట్‌గా ఉండను: విజయ్‌కు వనితారెడ్డి వార్నింగ్
హైదరాబాద్: సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో రోజుకో ఆడియో సంభాషణ వెలుగు చూస్తోంది. అయితే తాజాగా వెలుగు చూసిన ఆడియో సంబాషణలో విజయ్‌సాయిపై వనితారెడ్డి తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. తన ఇగోను హర్ట్ చేయకూడదంటూ వనితారెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
విజయ్ సాయి ఆత్మహత్య కేసు విచారణ సాగుతోంది.అయితే విజయ్ సాయి ఆత్మహత్య చేసుకొనే ముందు సెల్పీ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియో ఆధారంగా విజయ్ సాయి కేసును దర్యాప్తు చేయాలని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు డిమాండ్ చేశారు.
విజయ్ సాయి, వనితారెడ్డిలు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. వీరిదద్దరి మద్య కోర్టు కేసులున్నాయి.ఈ కేసుల విషయమై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.అయితే విజయ్ సాయి ఆత్మహత్య చేసుకొనే ముందు తన భార్య వనితారెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఆరోపణలు చేశారు.

నా ఇగోను హర్ట్ చేయకు
తెలుగు సినీ నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో భార్య వనితారెడ్డిపై ఆరోపణలు చేశారు.అయితే విజయ్ సాయి, వనితారెడ్డిల మధ్య చోటు చేసుకొన్న సంబాషణలు సంచలనం చోటు చేసుకొంది. ఈ సంబాషణలో విజయ్‌పై వనితారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నన్ను రెచ్చగొట్టొద్దు. నీకు తెలియదు కదా నా గురించి. సైలెంట్‌గా ఉండను. నీ వల్ల నాకు ఎంత ఇగో రేంజ్ అవ్వాలి.. నీకు అలాంటివి ఏమి ఉండవు అనుకుంటానని విజయ్ ను వనితారెడ్డి హెచ్చరించింది.

నా రక్తంలో అలానే ఉండిపోతోంది
ఒక్కసారి నా ఇగోను రెచ్చగొట్టావంటే అది నా రక్తంలో ఉండిపోతుంది. నీకు తెలియదు కదా నా గురించి.. చూడు నా ప్రతికారం ఎలా ఉంటుందో. ప్రతికారం తీర్చుకోకుండా నేను ఉండను. ఎంత వరకు నేను దిగజారుతానో నాకే తెలుసు. నేను ఎలా బతుకుతానో నీవు చూద్దువుకానీ. నువ్వు బాధపడకు అంటూ వనిత వార్నింగ్ ఇచ్చింది.

జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్న విజయ్
విజయ్ మాత్రం వనితను ప్రాధేయపడుతూ తనకు ఫోన్ చేస్తూ ఉండాలని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వనితకు సూచించాడు.నీ జీవితంలో ఓ మనిషి ఉండాలి. నీవు చేసిన పనులకు నీ ప్రవర్తనకు భవిష్యత్తులో జీవితం ఎలా ఉంటుందో నీకు అర్థం కావటం లేదు. నీవు అప్పుడప్పుడు నాకు టచ్‌లో ఉండు అని విజయ్ సాయి వనితారెడ్డిని ప్రాదేయపడ్డారు.

విజయ్‌ను హెచ్చరించిన వనితారెడ్డి
నీతో నాకు రెండు పనులు ఉంటాయి. రెండు నిమిషాలు మాట్లాడుతాను. తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నీవు ఏం చేస్తున్నావో.. ఎక్కడి వెళుతున్నావో నాకు అనవరం. నీకు మాత్రం జీవితంలో ఓ మనిషి ఉండాలి అని వనితకు విజయ్ సూచించాడు. అయితే విజయ్ మాటలను వనిత ఖాతరు చేయలేదు. తాను ఎంతగా దిగజారానో తనకు తెలుసుని మళ్లీ ఎలా బతుకుతానో చూస్తావంటే అంటూ విజయ్‌ని హెచ్చరించింది.

ఈ సంబాషణ ఎప్పుడు జరిగింది
విజయ్ సాయి, వనితారెడ్డిల మధ్య ఈ సంబాషణ ఎప్పుడు జరిగిందనే విషయమై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు జరిగిందా, లేక చాలా కాలం క్రితం జరిగిందా అనే విషయమై తేలాల్సి ఉంది..
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications