గజ్వెల్లో కెసిఆర్ మళ్లీ పోటీ చేస్తే ఓడిస్తా: వంటేరు ప్రతాప్ రెడ్డి
గజ్వెల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ ఎన్నికలక పోటీకి దిగితే తాను తప్పకుండా ఆయనను ఓడిస్తానని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి గురువారం నాడు కెసిఆర్‌కు సవాల్ విసిరారు.
2014లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కెసిఆర్ పైన ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. నాడు జరిగిన ఎన్నికల్లో వంటేరు 19,391 ఓట్ల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గజ్వెల్‌కు కెసిఆర్ చేసిందేమీ లేదన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్ మెదక్ లోకసభ నియోజకవర్గానికి, గజ్వెల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. గజ్వెల్లో వంటేరు... కెసిఆర్‌కు గట్టి పోటీగానే భావించారు. తన గెలుపు, పార్టీ గెలుపు పైన అనుమానంతోనే ఆయన రెండుచోట్ల పోటీ చేశారనే విమర్శలు వచ్చాయి.

టిఆర్ఎస్ కమీషన్ల పార్టీ: దాసోజు
తెలంగాణ రాష్ట్ర సమితి కమీషన్ల పార్టీ అని తెంగాణ పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ వేరుగా మండిపడ్డారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చితే సహించమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి నుంచి పోనివ్వమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొత్త ప్రాజెక్టులపై ఉన్న ప్రేమ పెండింగ్ ప్రాజెక్టుల పైన లేదన్నారు. కొత్త ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమేనని ఆరోపించారు.












Click it and Unblock the Notifications