అఘోరీ బండారం బయటపెట్టిన వర్షిణీ.. బీర్లు, సిగరెట్లు, బిర్యానీలు !!

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయిన అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. మొదటి భార్య ఫిర్యాదుతో పాటు పలు కేసుల కారణంగా కొంతకాలం జైలు శిక్ష అనుభవించాడు. కాగా ఇప్పుడు అఘోరీపై వర్షిణి సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీనివాస్ జైలుకు వెళ్లిన తర్వాత పోలీసులు ఒక ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన వర్షిణి, అఘోరీ విడుదలైన తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చి షాకింగ్ విషయాలు వెల్లడించింది. అఘోరీ వారి గ్రామానికి వచ్చినప్పుడు శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడిందని.. అతని కారు రిపేర్ అవ్వడంతో ఇంట్లో ఆశ్రయం కల్పించామని తెలిపింది. అదే అవకాశంగా తీసుకొని శ్రీనివాస్ మోసాలకు పాల్పడ్డట్టు వాపోయింది. తనకు మంత్రాలు వస్తాయని, కుటుంబం లేదని అనేక అబద్ధాలు చెప్పాడని వర్షిణి ఆరోపించింది.

varshini-serious-allegations-on-aghori-and-news-got-viral

మాయమాటలకు మోసపోయా..

దైవత్వం పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని అడ్డం పెట్టుకుని, శ్రీనివాస్ చెప్పిన మాయమాటలకు మోసపోయానని తెలిపింది. పెళ్లి విషయంలో సైతం తనను బలవంతం చేసినట్లు ఆమె పేర్కొంది. శ్రీనివాస్ తనను బెదిరించి పెళ్లి చేసుకున్నాడని.. నన్ను వదిలి వెళ్లిపోతే నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిందే" అని బెదిరించాడని తెలిపింది. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం చేసుకోవాల్సి వచ్చిందని వర్షిణి వెల్లడించింది. మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న ఆలయంలో వీరి వివాహం జరిగింది.

అసలు నిజాలు..

శ్రీనివాస్ అసలు అఘోరీనే కాదని వర్షిణి ఆరోపించింది. ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు చికెన్ తినడం, బీర్లు తాగడం వంటివి చేసేవాడని, ఆమె పక్కన ఉన్నప్పుడు కూడా కారు డ్రైవింగ్ చేస్తూ సిగరెట్ తాగడం తప్ప ఎలాంటి అఘోరీ సాధన చేసేవాడు కాదంది. లక్షలు సంపాదిస్తావని మాయమాటలు చెప్పి, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్‌కు అంతకుముందే మూడు పెళ్లిళ్లు అయ్యాయని, అతడి ప్రైవేట్ పార్ట్ డ్యామేజ్ అవ్వడం వల్లనే ఈ రూపంలోకి వచ్చాడని తెలిసిందని వర్షిణి వెల్లడించింది. అంతేకాకుండా, అతడి అసలు వయసు 38 ఏళ్లు కాగా, 27 ఏళ్లు అని చెప్పి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఫోన్ చేస్తే చిటికెలో డబ్బులు అకౌంట్‌లో పడతాయని చెప్పి మాయ చేసేవాడని తెలిపింది.

కాగా శ్రీనివాస్ మోసాలు, నిజాలు తెలిసిన తర్వాతే అతడితో విడిపోయానని వర్షిణి స్పష్టం చేసింది. తన వల్ల తన కెరీర్ దెబ్బతిందని చెబుతూ, ఇకపై మీడియాలో తన గురించి మాట్లాడితే బాగోదు అంటూ హెచ్చరించింది. "ఆడపిల్లల జీవితాలతో ఆడొద్దు" అని సీరియస్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+