హైదరాబాద్ సీపీగా ఇక సెలవు: నా మనసును ఎంతగానో కదిలించింది

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయనను ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. ఆయన స్థానంలో నూతనంగా మహేష్ భగవత్.. నగర పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. వీరితో పాటు మొత్తం 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి నూతన పోస్టుల్లో నియమించింది. బదిలీ అయిన వారిలో స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా, చారు సిన్హా, విక్రమ్ సింగ్ మాన్, నాగిరెడ్డి, అకున్ సభర్వాల్, స్టీఫెన్ రవీంద్ర వంటి సీనియర్లు ఉన్నారు.

కాగా.. తన బదిలీపై సజ్జనార్ స్పందించారు. హైదరాబాద్ నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది కాలం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన ప్రయాణంగా అభివర్ణించారు. ఈ ఏడాది కాలంలో నగర ప్రజలు తనతో పాటు, పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని, తాము చేపట్టిన ప్రతి సంస్కరణనూ తమ సొంత కార్యక్రమంగా భావించి ఎంతగానో ఆదరించారని పేర్కొన్నారు.

VC Sajjanar Emotional Farewell Note to Hyderabad and says Thank You to Citizens and Telangana Govt

మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్ లో ప్రజలంతా కలిసిమెలిసి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి పండుగనూ ఘనంగా జరుపుకొన్న తీరు తన మనసును ఎంతగానో కదిలించిందని సజ్జనార్ అన్నారు. ప్రజల క్షేమమే పరమావధిగా తాము అనేక అడుగులు వేశామని, ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై హెచ్ ఫాస్ట్ ద్వారా ఉక్కుపాదం మోపామని గుర్తు చేశారు.

అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..
అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..

భారీ ఎత్తున కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నంలో అండగా నిలిచిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల కట్టడి పోలీసుల వల్లే కాదని గుర్తించి.. ప్రజల్లో చైతన్యం తెస్తూనే బ్యాంకులు, డీపార్ట్మెంట్ ఆఫ్ టెలికం వంటి విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ఆపరేషన్ ఆక్టోపస్ కు శ్రీకారం చుట్టామని, దీనిపై కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి ప్రశంసించడం తమకు దక్కిన గౌరవంగా సజ్జనార్ పేర్కొన్నారు.

తెలంగాణ జనసేనలో భారీ ప్రక్షాళన
తెలంగాణ జనసేనలో భారీ ప్రక్షాళన

బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా కేసుల దర్యాప్తు కోసం ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్ ను ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లామని ఆయన అన్నారు. భావితరాల బిడ్డల్లో పోలీసుల పట్ల భయం పోయి, సమాజం పట్ల ఒక ఉన్నతమైన స్ఫూర్తి కలగాలని, ప్రత్యేకించి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో చేపట్టిన డే విత్ సీపీ కార్యక్రమం తనకు ఎంతో ఆత్మసంతృప్తిని మిగిల్చిందని చెప్పారు.

నగరవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో విజయవంతంగా అమలు చేశామని, ఆడబిడ్డల రక్షణను బాధ్యతగా భావించి మహిళల భద్రత కోసం స్పందన వాహనాలను అందుబాటులోకి తెచ్చామని, ఈ విజయాలన్నింటి వెనుక పోలీస్ కుటుంబం పడిన కష్టం దాగుందని సజ్జనార్ చెప్పారు.

శాంతిభద్రతలు, ట్రాఫిక్, సీఏఆర్, టాస్క్‌ఫోర్స్, సీసీఆర్బీ, ఎస్బీ, సీపీ ఆఫీస్, అడ్మిన్ విభాగాలు సహా.. పండుగైనా, పబ్బమైనా తమ సొంత కుటుంబాలను పక్కనపెట్టి రోడ్లపై నిలబడి అహర్నిశలు శ్రమించిన హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీల వరకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+