'సంతోషం': వర్సిటీల జాబితాలో హెచ్‌సీయూకి 4, ఉస్మానియాకు 33
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ కళాశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో తెలుగురాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల కేటగిరీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కు దేశంలోనే నాలుగో ర్యాంకు సాధించింది.
విశ్వవిద్యాలయాల కేటగిరీలో వంద యూనివర్సిటీల జాబితాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు విశ్వవిద్యాలయాలకే ఈ జాబితాలో స్థానం లభించింది. ఇందులో మూడు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఉన్నాయి.
ఇక ఇంజినీరింగ్ కళాశాలల్లో హైదరాబాద్ ఐఐటీకి 7వ స్థానం, వరంగల్ ఎన్‌ఐటీకి 28వ స్థానం దక్కింది. వందలోపు ర్యాంకులు పొందిన ఇంజనీరింగ్ కళాశాలల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందినవి ఆరు ఉన్నాయి. ఇందులో తెలంగాణకు చెందినవి మూడు కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి మూడు.
ఫార్మసీ కళాశాలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి మూడింటికి ర్యాంకులు లభించాయి. ఫార్మసీ కళాశాలల విభాగంలో వరంగల్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌కు 16వ స్థానం లభించింది. ఇక మేనేజ్‌మెంట్ రంగంలో హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థ ఐపీఈకి 38వ ర్యాంకు లభించింది.

యూనివర్సిటీ ర్యాంకులు:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ - హైదరాబాద్ - (4వ ర్యాంకు)
ట్రిపుల్ ఐటీ (డీమ్డ్ వర్సిటీ) - హైదరాబాద్ - (23వ ర్యాంకు)
ఉస్మానియా విశ్వవిద్యాలయం - హైదరాబాద్ - (33వ ర్యాంకు)
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ - తిరుపతి - (63వ ర్యాంకు)
జెఎన్‌టీయూ - కాకినాడ - (69వ ర్యాంకు)
యోగివేయన యూనివర్సిటీ - కడప - (92వ ర్యాంకు)
ఇంజనీరింగ్ ర్యాంకులు:
ఐఐటీ - హైదరాబాద్ - (7వ ర్యాంకు)
ఎన్ఐటీ - వరంగల్ - (28వ ర్యాంకు)
కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ పౌండేషన్ - గుంటూరు - (59వ ర్యాంకు)
సీబీఐటీ - హైదరాబాద్ - (71వ ర్యాంకు)
సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజీ - భీమవరం - (73వ ర్యాంకు)
విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ - గుంటూరు - (88వ ర్యాంకు)
మేనేజ్‌మెంట్:
ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ - హైదరాబాద్ - (38వ ర్యాంకు)
హెచ్ సీయూకు 4వ ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది: వీసీ
హైదరాబాద్ హెచ్‌సీయూకు దేశంలోనే 4వ ఉత్తమ వర్సిటీగా గుర్తింపు రావడం పట్ల వీసీ పి.అప్పారావు, విద్యార్దులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్లు, విద్యార్ధులు, బోధనేతర సిబ్బంది కృషి వల్లే హెచ్ సీయూకి నాలుగో స్దానం దక్కిందని వీపీ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే బెంగళూరులోని ఐఐఎస్‌సీ 91.81 పాయింట్లతో దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో మద్రాస్ ఐఐటీ (89.41 పాయింట్లు), మేనేజ్‌మెంట్ విభాగంలో బెంగళూరు ఐఐఎం (93.04 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాయి. ఇటీవల వివాదాలతో వార్తల్లోకెక్కిన జేఎన్‌యూ, హెచ్‌సీయూ వర్సిటీల జాబితాలో మూడు, నాలుగో ర్యాంకుల్ని సాధించాయి.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications