వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్‌ కేసు - డయాబెటిస్‌ నయం చేస్తానంటూ..!!

డైట్ ప్రాచుర్యకర్త వీరమాచినేని రామకృష్ణ పై సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వైద్యార్హతలు లేకుండా అవైజ్ఞానిక ప్రచారాలతో మోసం చేయడమే కాకుండా ప్రాణాలకు తీవ్ర ముప్పు కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్న 30 ఏళ్ల లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ సంచలన చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

ఆరోగ్య సమస్యల.. డైట్ మీద సోషల్ మీడియా వేదికగా 'వీరమాచి నేని డైట్‌', 'వీఆర్‌కే డైట్‌' పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి సుపరిచితుడైన వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు సమాచారం. మధుమేహంతో బాధపడుతున్న 30ఏళ్ల ఒక న్యాయ విద్యార్థి ఈ వీడియోలను చూసి ఇటీవల వీరమాచినేని రామకృష్ణను సంప్రదించారు.
రామకృష్ణతో పాటు కోటేశ్వరరావు కలిసి టైప్‌-1 డయాబెటిస్‌ నయం చేస్తామని కొన్ని ఆరోగ్య చిట్కాలు చెప్పారు. ఇన్సులిన్‌తో పాటు ఇతర మందులు వాడొద్దని, తమ చిట్కాలు మాత్రమే పాటించాలని సూచించారు. అందుకు రూ.26వేలు ఫీజు తీసుకున్నారు. వారి సూచనల మేరకు చిట్కాలు పాటించిన న్యాయ విద్యార్థి కేవలం రెండు రోజుల్లోనే అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.

హైటెక్ సిటీలో కొత్తగా 10 ప్రధాన రైళ్లకు హాల్టింగ్- ట్రైన్స్, టైమింగ్స్ వివరాలు..!!
హైటెక్ సిటీలో కొత్తగా 10 ప్రధాన రైళ్లకు హాల్టింగ్- ట్రైన్స్, టైమింగ్స్ వివరాలు..!!
veeramachineni-ramakrishna-booked-in-cyberabad-over-veeramachineni-diet-here-the-details

ఫిర్యాదు .. కేసు

దీంతో బాధితుడు సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించి వీరమాచినేని రామకృష్ణ చెప్పిన ఆరోగ్య చిట్కాల వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందని ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 318(4), 125(ఏ), 61(2)లతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలోని సెక్షన్ 54, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ సెక్షన్లు 3, 4 కింద తీవ్రమైన కేసులు నమోదు చేశారు. మోసపూరిత సలహాలతో తన ప్రాణాల మీదికి తెచ్చినందుకు పరిహారం చెల్లించాలని కోరుతూ బాధితుడు నాంపల్లి వినియోగదారుల కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+