వ్యభిచారం దందా చేశాడు: పెళ్లిళ్ల పేరుతో ఎన్నారై స్త్రీలకు వల వేశాడు (వీడియో)
హైదరాబాద్: ఈ వెంకటరత్నా రెడ్డి భలే మోసగాడు. భూకబ్జాలు, భూమి సెటిల్మెంట్లు చేశాడు. అదీ సరిపోలేదు. ఐఆర్ఎస్ అధికారనంటూ తెలుగు సినీ నిర్మాతలను బెదిరించాడు. చివరకు వ్యభిచారం దందా నిర్వహించాడు. అయితే, అవేవీ అశించిన మేరకు డబ్బులు సమకూర్చలేకపోయాయి.
దాంతో ఎన్నారై మహిళలకు పెళ్లిళ్ల పేరుతో వలవేయడం ప్రారంభించాడు. భారతీ మాట్రిమోనీ డాట్ కామ్‌లో తనకు పెళ్లి కాలేదని, ఒంటరిగా ఉంటున్నానని, తల్లిదండ్రులు చనిపోయారని, అమెరికాకు బిజినెస్ మీద వెళ్తున్నానని అంటూ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేసి ఎన్నారై మహిళలను మోసగించాడు.
ఎన్నారై మహిళలను అలా మోసగిస్తున్న గుంటూరుకు చెందిన కె. వెంకటరత్నా రెడ్డిని హైదరాబాద్ నగర క్రైమ్ పోలీసులు గుంటూరులో ఇటీవల అరెస్టు చేశారు. విడాకులు తీసుకుని అమెరికాలో ఉంటున్న తన అక్క కూతురికి భారతీమాట్రిమోన్ డాట్ కామ్‌లో నిందితుడి ప్రొఫైల్ చూసి పెళ్లి చేసుకుందని, 20 రోజులు కాగానే అతను భారత్‌లో అత్యవసరమైన పని ఉందని రూ. 20 లక్షలు తీసుకుని వచ్చి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడని బాధితురాలి మేనమామ రాజశేఖర రెడ్డి నెల 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సెర్చ్ చేస్తే రంగు బయటపడింది
వెంకటరత్నా రెడ్డి ప్రొఫైల్‌ను ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా అతడో నేరస్తుడని, అతడికి తల్లితో పాటు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలిసిందని రాజశేఖర రెడ్డి చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి సెల్ ఫోన్ నంబర్లు, పాత సెల్ నెంబర్లతో పాటు అతడి ఫేస్‌బుక్ ఖాతాలు, పోలీసు స్టేషన్లలో అతడిపై నమోదైన కేసులను పరిశీలించారు. సెల్‌ఫోన్ లోకేషన్ టవర్ల ఆధారంగా గుంటూరు ఉన్నట్లు తెలుసుకుని శుక్రవారం అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకుని వచ్చారు. ఈ ఏడాది మేలో విశాఖ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి అతడికి పాస్‌పోర్టు వచ్చిందని నేరచరిత ఉన్నా ట్రాక్ రికార్డు పరిశీలించకుండా ఎస్‌బి అధికారులు పాస్‌పోర్టు ఎలా జారీ చేశారనే విషయంపై వివరణ కోరుతామని పోలీసులు చెప్పారు.

మరో ఇద్దరు ఎన్నారై మహిళలకు గాలం
నిందితుడు వెంకటరత్నా రెడ్డి అమెరికాలోని మేరీ అనే మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈమెను పెళ్లి చేసుకునేందుకు అమెరికా వెళ్లిన అతను మరో మహిళను కూడా వలలో వేసుకున్ాడు. మేరీని పెళ్లి చేసుకుందామని ఇప్పటికే సర్టిఫికెట్ తీసుకున్నాడు. కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మరో నాలుగు రోజుల్లో అక్కడికి వెళ్తున్నట్లు నిందితుడు పోలీసులకు విచారణలో తెలిపాడు.

నిందితుడి ఖాతాలో 4 వేల అమెరికా డాలర్లు
నిందితుడి బ్యాంక్ ఖాతాలో 4 వేల అమెరికా డాలర్లు ఉన్నాయని, వాటిని సీజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అతడి ఫేస్‌బుక్ ఖాతాలో 300 మంది అమ్మాయిలు ఉన్నారని, అతని వలలో పడి ఎవరైనా మోసపోయారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నామని, కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతామని పోలీసులు చెప్పారు.

అతని నేర చరిత్ర ఇదీ...
డిగ్రీ కూడా పూర్తి చేయని వెంకటరత్నా రెడ్డి ఉద్యోగం లభించకపోవడంతో తన స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలో అడుగుపెట్టాడు. అయితే, అందులో నష్టాలు రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో మోసాలకు తెర తీశాడు. ఇందులో భాగంగానే ఐఆర్ఎస్ అధికారిగా అవతారమెత్తి సినీ నిర్మాతలతో పాటు ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయబోయాడు. ఇందుకు సంబంధించి హైదరాబాదులోని బంజారాహిల్స్, ఎస్ఆర్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి.

వ్యభిచారం దందా చేస్తూ పట్టుబడి...
జూబ్లీహిల్స్‌లో వ్యభిచార దందా నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. గుంటూరులో పక్కింటివారి సాంత్రో కారు దొంగిలించాడు. డమ్మీ తుపాకీతో ఓ బ్యాంక్ అధికారిని బెదిరించాడు. అతనిపై హైదరాబాదులో ఏడు, గుంటూరులో రెండు కేసులు ఉన్నాయి.ఈ వెంకటరత్నా రెడ్డి భలే మోసగాడు. భూకబ్జాలు, భూమి సెటిల్మెంట్లు చేశాడు. అదీ సరిపోలేదు. ఐఆర్ఎస్ అధికారనంటూ తెలుగు సినీ నిర్మాతలను బెదిరించాడు. చివరకు వ్యభిచారం దందా నిర్వహించాడు. అయితే, అవేవీ అశించిన మేరకు డబ్బులు సమకూర్చలేకపోయాయి.












Click it and Unblock the Notifications