తెలంగాణలో అతి భారీ నుంచి అసాధారణ వర్షాలు: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

హైదరాబాద్: ఇప్పటికే కురిసిన కుండపోత వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు దిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. తాజాగా, భారతా వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. తెలంగాణలో గురువారం భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణ వర్షపాతం 24 సెంటీమీటర్లకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

heavyrains1

వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ రెండు రోజులు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది.

బుధవారంనాటి తీవ్ర అల్పపీడనం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ ఒడిశా పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతోంది. ఈ అల్పపడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందన్నారు.

heavyrainsintelangana

రుతుపవన ద్రోణి గురువారం బికనీర్, కోట, రైజన్, దుర్గ్, దక్షిణ ఒడిశా పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని అల్పపీడన ప్రాంతం మీదుగా తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించింది.

ఇప్పటికే కురిసన భారీ వర్షాలతోపాటు హైదరాబాద్ తోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వంతెనలు, రోడ్లు తెగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో వరదనీటిలో గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్లు, ట్రాక్ లపైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ రైల్వే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+