సినిమాలు ఆడలేదని పవన్ రాజకీయం: నిలదీసిన విహెచ్, హెచ్చరిక

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా, కాపు రిజర్వేషన్ల అంశం పైన ఆయన నిలదీశారు.

నువ్వెంత.. నీ లెక్కెంత: పవన్‌పై టిడిపి ఆగ్రహం వెనుక! 2 వ్యూహాలు

ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తన సినిమాలు నడవక పోవడంతో మళ్లీ రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమానికి ఎందుకు మద్దతివ్వడం లేదో చెప్పాలన్నారు.

VH hits out at Pawan Kalyan

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేశారో చెప్పాలన్నారు. సగం సినిమాలు, సగం రాజకీయాలు వద్దని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీని తిడితే ఎట్టి పరిస్థితుల్లోను తాము ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా అన్నారు.

కాగా, ప్రత్యేక హోదా పైన మాట్లాడిన పవన్ కళ్యాణ్‌కు పలువురి నుంచి మద్దతు లభిస్తోంది. పవన్ ఉద్యమిస్తే మద్దతిస్తామని టిడిపి, వైసిపి నేతలు చెబుతున్నారు. నటుడు శివాజీ కూడా అండగా నిలబడ్డారు. మరో నటుడు సంపూర్ణేష్ బాబు కూడా మద్దతు పలికారు.

టిడిపి కొత్త వాదన!: మోడీ వద్దకు.. చిరంజీవి-పవన్ కళ్యాణ్ కలిసేనా?

ఈ మేరకు సంపూ ఓ లేఖ రాశారు. ప్రత్యేక హోదా పైన మాట్లాడిని పవన్‌కు తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాని, తాను తెలంగాణలో పుట్టానని, తన సోదర తెలుగు రాష్ట్ర ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నారని, వారి గుండెల్లో ఇంత ఆగ్రహం ఉందని పవన్ స్పీచ్ ద్వారా తెలిసి గుండె బరువెక్కిందని, రాష్ట్రాలు వేరైనా, కష్టం వచ్చినప్పుడు అందరం ఒక్కటే, సీమాంధ్రుల బాధను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడికి ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+