రెండేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవాలి.. పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నా.. వీహెచ్ సంచలన కామెంట్స్
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ నేతలు ఫిరాయింపులకు పాల్పడటం అప్రజాస్వామికమని మొత్తుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కారెక్కిస్తుండటం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడేమో హస్తం గుర్తుపై గెలిచి ఇప్పుడు గులాబీ తీర్థం పుచ్చుకోవడం సరికాదంటున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తిరగబడమని ప్రజలకు పిలుపునిస్తామన్నారు వీహెచ్. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు హరిప్రియ, రేగ కాంతారావుపై జరిగిన దాడిని ఆయన సమర్థించారు. అది సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ పై జరిగిన దాడిగా అభివర్ణించారు.
ఖబడ్దార్ కేసీఆర్.. మావోయిస్టుల పోస్టర్ల కలకలం.. పరిషత్ ఎన్నికల వేళ టెన్షన్ టెన్షన్

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్న వీహెచ్.. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలని.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లికి మొక్కుకున్నానని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రగతి భవన్ విడిచి పారిపోయే పరిస్థితి తప్పకుండా వస్తుందన్నారు. ఇంటర్ ఫలితాల తప్పిదాలతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వాళ్ల కుటుంబాలను పరామర్శించే తీరిక లేని కేసీఆర్ కు కేరళ టూర్ ముఖ్యమైందని ధ్వజమెత్తారు. దళితుల పక్షమంటూ 50 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతామని చెప్పి.. ఐదు అడుగుల విగ్రహాన్నే కూల్చివేశారని ఎద్దేవా చేశారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications