శ్రీనివాస్ హత్య: తెరాస ఎమ్మెల్యే వీరేశంపై విహెచ్ సంచలనం
హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య సంఘటన విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనభ్యుడు వేముల వీరేశంపై కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్య చేశారు.
Recommended Video

వేముల వీరేశాన్ని ఎన్‌కౌంటర్ చేయాలని ఆయన అన్నారు. హత్యా రాజకీయాల కోసం తెలంగాణ రాలేదని ఆయన అన్నారు. నయీం మాదిరిగానే వీరేశం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వీరేశం నయీం కన్నా ఎక్కువ...
తెరాస శాసనసభ్యుడు వేముల వీరేశం నయీం కన్నా ఎక్కువ అని కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. వీరేశం ఫోన్ కాల్ లిస్టు చూస్తే వాస్తవాలు బయటపడుతాయని ఆయన అన్నారు. తన కాల్ లిస్టు చూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

నకిరేకల్ వైపు పారిపోయారు...
బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు నకిరేకల్ వైపు పారిపోయారని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.మూడేళ్లుగా ప్రాణహాని ఉందని చెబుతున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తనకు కూడా ప్రాణహని ఉందని ఆయన అన్నారు. పోలీసు అధికారులు పనికిరాని మాటలు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

గన్ మ్యాన్ కావాలని అడిగినా...
తన ప్రాణాలకు హాని ఉందని, గన్‌మ్యాన్‌ను ఇవ్వాలని అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్‌ను తెరాస కార్యకర్తలే హత్య చేశారని ఆయన అన్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భద్రత పెంచాలని డిజిపికి లేఖ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

హత్యతో తెరాసకు సంబంధం లేదు
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో తమ పార్టీకి సంబంధం లేదని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చెప్పారు. ఏ ఘటన జరిగినా తెరాకు ఆపాదించడం కాంగ్రెసుకు అలవాటుగా మారిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ హత్యకు జిల్లా మంత్రితో పాటు ఎమ్మెల్యే వీరేశం బాధ్యత వహింంచాలనడం అర్థం లేనిదని ఆయన వ్యాఖ్యానించారు.
ఏ విచారణకైనా సిద్దం...
బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యపై ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు కర్నె ప్రభాకర్ తెలిపారు. శ్రీనివాస్‌ను హత్య చేసినవారుర కాంగ్రెసు పార్టీలోనే క్రియాశీలకంగా ఉన్నారని, ఫొటోలే విచారణకు ప్రామాణికమైతే నిందితులంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫొటోలు దిగారని ఆయన అన్నారు. వీరేశం కాల్ లిస్టు బయటపెట్టేందుకు అభ్యంతరం లేదని, కోమటిరెడ్డి ఫోన్ కాల్ లిస్టు కూడా బయటపెట్టాలని ఆయన అన్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications