Smita Sabharwal: స్మితా సబర్వాల్ గారు మీ కోసమే ఈ వీడియో..!
కొంత మంది తమకు అన్ని ఉన్నా.. ఏం చేయలేరు. కానీ కొంత మంది మాత్రం వైకల్యం ఉన్నా భయపడకుండా ముందుకెళ్తారు. వైకల్యాన్ని జయించి విజయం సాధిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. తాజాగా ఓ దివ్యాంగుడు జొమాటో డెలివరీ బాయ్ గా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్ లో ఓ దివ్యాంగుడు జొమాటో డెలివరీ బాయ్ గా తన టీవీఎస్ ఎక్స్ ఎల్ పై ఫుడ్ డెలవరీ చేస్తున్నారు. ఓ కర్ర సాయంతో అతను బండి నడుపుతున్నాడు.
ట్రాఫిక్ లో దివ్యాంగుడు వాహనం నడుపుతూ ఫుడ్ డెలవరీ చేయడం కష్టమైన పనే.. కానీ అతను ఆ కష్టాలను అధిగమిస్తూ పని చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ దివ్యాంగ ఫుడ్ డెలవరీ బాయ్ కి చెందిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. "కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది కష్టంలో నుంచి బయటపడిన వాళ్లే గొప్పవారు. కష్టం నుంచే బాధ తెలిసింది. అప్పుడే మనిషికి ఎలాంటి లోపం ఉన్న బతుకు సాగించాలి అంతే. నీ పట్టుదలకు హ్యాట్సాఫ్' అంటూ రాసుకొచ్చారు.

ఈ సందర్భంలోనే కొంత మంది నెటిజన్లు ఐఏఎస్ స్మితా సబర్వాల్ ను గుర్తు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె దివ్యాంగుల గురించి ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. వైకల్యం ఉన్న పైలట్‌ను ఎయిర్‌లైన్ నియమించుకుంటుందా? లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్‌ని విశ్వసిస్తారా అని రాసుకొచ్చారు. సివిల్స్ ఉద్యోగాల్లో పని చేయడానికి శారీరక దృఢత్వం అవసరమని ఆమె పేర్కొన్నారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీనిపై దివ్యాంగులు తీవ్రంగా స్పందించారు.
ఇప్పుడు దివ్యాంగ ఫుడ్ డెలివరీ బాయ్ వీడియో చూసిన నెటిజన్లు.. స్మితా సబర్వాల్ గారు ఇది చూడండి అని అంటున్నారు. ఈ దృఢత్వం చాలా అని ప్రశ్నిస్తున్నారు. మనిషికి కావాల్సి అందం, మంచి పర్సనాలిటీ కాదని.. ఏదైనా సాధిస్తామనే సంకల్పం ఉండాలని చెబుతున్నారు. స్మితా సబర్వాల్ దివ్యాంగుల పట్ల ఇప్పటికైనా తన అభిప్రాయం మార్చుకోవాలని సూచిస్తున్నారు.
కష్టం ప్రతి ఒక్కరికి వస్తుంది కష్టంలో నుంచి బయటపడిన వాళ్లే గొప్పవారు.. కష్టం నుండే బాధ తెలిసింది. అప్పుడే మనిషికి ఎలాంటి లోపం ఉన్న బతుకు సాగించాలి అంతే.నీ పట్టుదలకు హ్యాట్సాఫ్👏🤝 pic.twitter.com/hIeXKAhr4y
— Vikram mudhiraj (@vikram_TRS) November 18, 2024












Click it and Unblock the Notifications