Medigadda: లోపాల పుట్ట మేడిగడ్డ.. బయటపడుతోన్న బాగోతం..!
మేడిగడ్డ బ్యారేజీ లోపాలు ఒక్కోక్కటిగా బయట పడుతోన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తులో అనేక లోపాలు బయటపడుతున్నట్లు సమాచారం. క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్ల నుంచి అవసరమైన సమాచారం, రికార్డులు కోరగా.. వారు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.
పిల్లర్లు కుంగిన ఏడో బ్లాక్ లో గ్లేసియర్స్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు కాంక్రీట్ లేచిపోయినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
నాణ్యతకు సంబంధించి 18 రకాల వివరాలివ్వాలని క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు స్పష్టం చేశారు. టీరియల్‌ను పరీక్షించిన వివరాలు, కాంక్రీటు మిక్స్ డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్‌లో చేసిన పరీక్షల వివరాలు, ప్రతినెలా బిల్లులు చెల్లించేందుకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చే ముందు రికార్డుల పరిశీలనకు సంబంధించి ఆధారాలు, కోర్ తీసి చేసిన పరీక్షల సమాచారం, ఇన్వెస్టిగేషన్, సర్వే వివరాలను తేదీలు సహా ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

ఏడో బ్లాక్‌లోని 20వ పియర్ కి ఇరువైపులా ఉన్న 19, 21 పియర్స్ దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. 22వ పియర్ లో పగుళ్లు వచ్చాయి. 11 పీయర్ లో కూడా పర్రెలు కనిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బ్యారేజీ గేట్ల వద్ద గ్లేసియర్స్ కూడా దెబ్బతిన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉంది.
మరోవైపు మేడగడ్దడలో కుంగిన పిలర్లు తొలగించడం కూడా సవాల్ గా మారింది. కుంగి పిలర్లను తొలగించే క్రమం మిగతా పిల్లర్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఎలా రిపేర్ చేయాలో తర్జనభర్జన పడుతోన్నారు.












Click it and Unblock the Notifications