Dont Miss:హైదరాబాదులో మిస్సైల్స్..ఆయుధాలు: మీరు చూసొచ్చారా బ్రో..?

Missile Expo:హైదరాబాదు మరో వైజ్ఞానిక వేడుకకు వేదికగా నిలిచింది. నగరంలోని గచ్చిబౌలీ స్టేడియంలో విగ్యాన్ వైభవ్ పేరుతో నిర్వహించిన సైన్స్ అండ్ డిఫెన్స్ ఎక్స్‌పో ఆకట్టుకుంది. ప్రముఖ రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీవో నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ ఎక్స్‌పో మూడురోజుల పాటు జరగనుంది. శుక్రవారం రోజున రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డిలు ఈ ఎక్స్‌పోను ప్రారంభించారు. తొలిరోజున స్కూలు విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులను అనుమతించారు. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

నిజమైన క్షిపణులు..విద్యార్థుల్లో ఆనందం
క్షిపణి లేదా మిసైల్స్‌ను ఎప్పుడూ సినిమాలో చూడటం లేదా టీవీల్లో చూడటమో జరుగుతుంది. అయితే యుద్ధం సంభవించినప్పుడు దేశం మిలటరీ వినియోగించే క్షిపణిలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. వాటిని తాకి చాలా సంబరపడ్డారు విద్యార్థులు. తాము ఇలాంటి నిజమైన క్షిపణిలను చూస్తామని అనుకోలేదని... ఈ చక్కటి అవకాశం కల్పించిన డీఆర్‌డీఓకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఇక క్షిపణులతో పాటు మిలటరీ ఆయుధాలను అస్త్రాలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ముఖ్యంగా ఎత్తయిన ఆర్టిలరీ గన్స్, మెజిస్టిక్ ట్యాంక్స్, రేడార్లను సందర్శకుల కోసం ఉంచారు. చాలా దగ్గర నుంచి వీటిని చూసిన విద్యార్థులు ఎగిరి గంతేయడమే కాదు..చక్కటి అనుభూతిని పొందినట్లు చెప్పారు.

vigyan-vaibhav-a-science-and-defence-expo-in-hyderabad-enjoyed-by-students-details-here

ఇక ఈ మధ్యనే టెస్ట్ చేసిన హైపర్‌సానిక్ మిస్సైల్, ప్రళయ్ క్షిపణి,పినాక క్షిపణి వ్యవస్థ,షార్ట్ రేంజ్ బలాస్టిక్ క్షిపణి వ్యవస్థ అగ్ని 5 మిసైల్, భారత అమ్ములపొదిలో ప్రధాన అస్త్రమైన యుద్ధ ట్యాంక్ అర్జున్,అధునాతన ఆర్టిలరీ గన్ సిస్టం, 155ఎంఎం గన్స్, రుద్రం, యాంటీ రేడియేషన్ మిసైల్స్‌ను ప్రదర్శనలో ఉంచారు. వీటన్నిటినీ చూసిన విద్యార్థులు తమ ఫోన్లలోని కెమెరాలకు పనిచెప్పారు. క్షిపణులను క్లిక్‌మనిపించారు. విద్యార్థులు క్షిపణిల ముందు నిల్చుని ఫోజులివ్వగా టీచర్లు ఫోటోలు తీశారు.

Take a Poll

డీఆర్‌డీఓ నేతృత్వంలో..
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విద్యార్థులు వందల సంఖ్యలో ఈ డిఫెన్స్ ఎక్స్‌పోకు హాజరయ్యారు. మిసైల్ పనితీరు ఆ వ్యవస్థ గురించి సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. క్షిపణి వ్యవస్థ పనితీరును గూర్చి వివరించిన శాస్త్రవేత్తలు డిఫెన్స్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను గురించి వివరించారు. ఏవియానిక్స్, రేడార్లు, మిసైల్ గురించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లభించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలైన బీడీఎల్, బీహెఇఎల్,ఇండియన్ నేవీ, మిధానీ 200 స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+