విజయ్ చివరి కోరిక: వెలుగులోకి వనితా రెడ్డితో ఆడియో సంభాషణ

Recommended Video

    హాస్య నటుడు విజయ్ చివరి కోరిక వెలుగులోకి

    హైదరాబాద్: హాస్య నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య వనిత రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కుటుంబ తగాదాలపై పలు ఆరోపణలు వినిపిస్తుండడంతో పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

    విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో స్పష్టంగా లేదు. దీంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వనితా రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి.

    ఆమెపై ఇవీ రెండు కేసులు...

    ఆమెపై ఇవీ రెండు కేసులు...

    విజయ్ ఇంటికి నలుగురితో వచ్చి వనితా రెడ్డి కారు తీసుకువెళ్లినట్లు ఒక కేసు నమోదు కాగా, విజయ్ ఆత్మహత్యకు కారణమని మరో కేసు వనితా రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వనితా రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతోనే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

     వెలుగు చూసిన ఆడియో సంభాషణ

    వెలుగు చూసిన ఆడియో సంభాషణ

    విజయ్ ఆత్మహత్య చేసుకోక ముందు తన భార్య వనితతో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో సంభాషణ వెలుగు చూసింది. అందులో విజయ్ తన భార్య వనితను చివరి కోరికను కోరినట్టు స్పష్టంగా ఉంది. వనితతో ఈ ఫోన్ సంభాషణ సమయంలోనే విజయ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు దాన్ని బట్టి తెలుస్తోంది.

     రెండు రోజులు గడపాలని...

    రెండు రోజులు గడపాలని...

    రెండు రోజులపాటు తనతో ఆనందంగా గడపాలని తన చివరి కోరిక అంటూ విజయ్ ఫోన్‌లో వనితను అభ్యర్థించినట్టు తెలుస్తోంది. కాగా, విజయ్‌సాయి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయకపోవడంపై అతని తండ్రి సుబ్బారావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెల్పీ వీడియో ఆధారంగా, ఇప్పటి వరకు వనిత, న్యాయవాది శ్రీనివాస్, వ్యాపారవేత్త శశిధర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

     ఆ ముగ్గురే కారకులు..

    ఆ ముగ్గురే కారకులు..

    తన కొడుకు ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారకులని సుబ్బారావు గురువారం మీడియాతో అన్నారు. తన కొడుకుతో వేరుగా ఉంటున్న వనితకు నగలు, కారు తీసుకెళ్లమని ఏ కోర్టు కూడా చెప్పలేదని, అయినప్పటికీ వనిత తన కొడుకును బెదిరించి కారు తీసుకెళ్లిందని సుబ్బారావు ఆరోపించారు. ఆమె వెనుక ఉన్న వ్యక్తులు కొద్ది రోజులుగా విజయ్‌ను వేధిస్తున్నారని, మనస్తాపానికి చెందిన విజయ్ ఆత్మహత్యకు చేసుకున్నాడని ఆయన అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+