Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబుకు గట్టి షాక్: టిడిపికి విజయ రామారావు రాజీనామా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విజయ రామారావు శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన అధినేతకు పంపించారని తెలుస్తోంది.

విజయ రామారావు తెలుగుదేశం పార్టీలో కీలక నేత. హైదరాబాదులో టిడిపి తరఫున మంచి పట్టు ఉన్న నేత. 1999లో ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు.

Vijaya Rama Rao resigns Telugudesam

విజయ రామారావు సిబిఐ డైరెక్టరుగా పని చేశారు. ఆ తర్వాత చంద్రబాబు పిలుపుతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి జనార్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

తెలుగుదేశం పార్టీకి హైదరాబాదులో వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ప్రస్తుతం మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి తదితరులు కారు ఎక్కారు. ఇటీవలే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూడా టిఆర్ఎస్‌లో చేరారు. తాజాగా సీనియర్ నేత విజయ రామారావు రాజీనామా చేయడం గమనార్హం.

24న గ్రేటర్‌లో టిడిపి బహిరంగ సభ

Vijaya Rama Rao resigns Telugudesam

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 24వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది.

ఈ విషయమై చర్చించేందుకు టిడిపి యువనేత నారా లోకేష్ తెలంగాణ టిడిపి కార్యకర్తలతో భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. చంద్రబాబు కూడా నియోజకవర్గాలుగా సమీక్ష నిర్వహించనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. అలాగే బహిరంగ సభల్లోను పాల్గొంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+