చిరంజీవితో సిద్ధం, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతాడో లేడో: విజయశాంతి
Recommended Video

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత, ప్రముఖ నటుడు చిరంజీవితో కలిసి ప్రచారం చేసేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు ఆవేశం ఎక్కువ అని, రాజకీయాల్లో ఆయన సక్సెస్ అవుతారో లేదో చూడాలన్నారు.
ఫెడరల్ ఫ్రంట్‌ను కూడగడతానని చెప్పిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కేసీఆర్ అహంకారపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని, తెరాసపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, ప్రచారం మాత్రం చేస్తానని చెప్పారు.

ఎన్నికల ప్రచార షెడ్యూల్ పైన కసరత్తు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో మహాకూటమి గురించి స్పందిస్తూ... ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. ఈ కూటమి ద్వారా తెరాసను గద్దె దింపడం సాధ్యమే అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పార్టీ పెద్ద పీట వేయాలన్నారు.












Click it and Unblock the Notifications