హైదరాబాద్ - విజయవాడ హైవే బంద్: ఇలా వెళ్లాల్సిందే..!!

భారీ వర్షాల ప్రభావం రవాణా మార్గాలపైన ప్రభావం చూపింది. రైల్వే ట్రాక్ లు పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయాయి. పలు రైళ్లు రద్దయ్యాయి. మరి కొన్నింటిని దారి మళ్లించారు. రోడ్డు ప్రయాణాలు నిలిచిపోయాయి. పలుచోట్ల వరద ప్రవాహానికి రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

వాహనాలు నిలుపుదల
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ ప్రవాహం ప్రధాన రహదారులపైకి వచ్చి వాహనాలు ప్రయాణించేందుకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పాలేరు బ్యాక్‌ వాటర్‌ జాతీయ రహదారి 65పైకి చేరడంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్‌ను మళ్లించారు మరోవైపు ఏపీలోని కృష్ణాజిల్లా నందిగామ వద్ద కూడా .65వ నంబర్‌ జాతీయ రహదారిపైకి నీరుచేరడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది.

Vijayawada-Hyderabad NH 65 was closed at several places buses diverted

వరద ప్రభావం
మున్నేరు వాగు పొంగడంతో ఐతవరం సమీపంలోని జాతీయ రహదారిపై నీరు నిలిచింది. హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను కీసర టోల్‌ప్లాజా వద్ద అక్కడి పోలీసులు నిలిపివేశారు. నార్కట్‌పల్లి నుంచి 65వ నెంబర్‌ జాతీయరహదారిపై ట్రాఫిక్‌ని నార్కట్‌పల్లి-అద్దంకి హైవేకు మళ్లించగా.. ఈ రోడ్డుపై రద్దీ పెరిగింది. నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి నుంచి దామరచర్ల వరకు ట్రాఫిక్‌ రద్దీ రాత్రి వరకూ కొనసాగింది విజయవాడ నుంచి వయా గుంటూరు, అద్దంకి, మిర్యాలగూడ, నల్లగొండ, హైదరాబాద్‌కు వాహనాలు మళ్లించారు.

నిలిచిన ప్రయాణాలు
విజయవాడ నుంచి ఖమ్మంకు వెళ్లే ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామం వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద ఐదు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో హైదరాబాద్‌- విజయవాడ రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం మీదుగా సూర్యాపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం నుంచి మధిరకు రాకపోకలు నిలిచాయి మధిర-బోనకల్‌, మధిర-పెనుగంచిపోలువైపు రోడ్లపై నీరు చేరడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నిలిపివేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+