రేవంత్ ను జిల్లా దాటించలేదు.. మా అదుపులోనే ఉన్నారు : జిల్లా ఎస్పీ

కొడంగల్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ ఆరోపణలకు తావిస్తోంది. ఇంట్లోకి చొరబడి అరెస్ట్ చేసేంత తాను ఏ నేరం చేశాడనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఆయన సతీమణి గీత కూడా పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన భర్తను ఎక్కడకు తీసుకెళ్లాలో చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీరియస్ అయ్యారు. ఎట్టకేలకు వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ స్పందించారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయాలు వెల్లడించారు.

రేవంత్ రెడ్డి మా అదుపులోనే ఉన్నారని చెప్పారు ఎస్పీ. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ సభ అయిపోగానే రేవంత్ రెడ్డిని విడుదల చేస్తామన్నారు. ఈసీ ఆదేశాలతోనే రేవంత్ పై కేసులు పెట్టామని.. అందుకే ముందస్తుగా అరెస్ట్ చేశామన్నారు. రేవంత్ రెడ్డిని జిల్లా దాటించి ఎక్కడకు తీసుకుపోలేదని.. మహబూబ్ నగర్ తరలించామని చెప్పారు.

vikarabada sp told that revanth reddy is in our control
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+