Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వికారుద్దీన్: వాహనం ఆపమని, గన్స్‌లాక్కునే యత్నం

వరంగల్/నల్గొండ: వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులో తీవ్రవాదులు వికారుద్దీన్ సహా ఐదుగురు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఎంతో ఉగ్ర చరిత్ర ఉన్న వికారుద్దీన్‌ను పోలీసులు 2010 జూలై 15న వరంగల్ జైలుకు తరలించారు. అప్పటి నుండి కోర్టుకు తీసుకు వెళ్లే ప్రతి సమయంలో పోలీసులపై దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడనే వాదనలు ఉన్నాయి. అంతేకాదు, జైలులోను అదే తీరు ఉంటుంది.

అలాంటి వికారుద్దీన్, మరో నలుగురు మంగళవారం మృతి చెందారు. ఐదుగురు తీవ్రవాదులను వరంగల్ జైలు నుండి హైదరాబాద్ తరలిస్తుండగా జనగామ దాటాక, ఆలేరు మరో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉందనగా, కాకతీయ తోరణం వద్ద మూత్ర విసర్జన కోసం వాహనం ఆపాలని ఉగ్రవాదులు అడిగారు. దీంతో పోలీసులు ఆపారు.

ఆ సమయంలో ఉగ్రవాదులు పోలీసుల నుండి తుపాకులను లాక్కునే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఇతర ఆయుధాలతోను దాడికి పాల్పడి పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు తుపాకులు లాక్కునే ప్రయత్నాన్ని అడ్డుకొని వారి పైన కాల్పులు జరిపారు. దీంతో వారు మృతి చెందారు. పోలీసు వాహనం వరంగల్ జైలు నుండి ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరింది. ఆ తర్వాత గంట తర్వాత ఎన్‌కౌంటర్ జరిగింది.

ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు: ఐజీ నవీన్ చంద్

Vikaruddin and gang were shot dead

పోలీసులు ఆత్మరక్షణ కోసం ఉగ్రవాదుల పైన కాల్పులు జరిపారని ఐజీ నవీన్ చంద్ చెప్పారు. ఘటన జరిగినప్పుడు తాను హైదరాబాదులో ఉన్నానని తెలిపారు. ఎస్కార్ట్ వాహనంలో పదిహేడు మంది పోలీసులు ఉన్నారన్నారు.

వరంగల్ సెంట్రల్ జైలు నుండి నాంపల్లి కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. ఉగ్రవాదులు వ్యాన్ నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేశారని, ఆయుధాలు లాక్కునే ప్రయత్నాలు చేశారన్నారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారన్నారు.

నా కొడుకును చంపేశారు: వికారుద్దీన్ తండ్రి

నా కొడుకును పోలీసులు చంపేశారని వికారుద్దీన్ తండ్రి చెప్పాడు. వరంగల్ జైలు నుండి హైదరాబాదు జైలుకు తరలించాలని నెల క్రితం ఒకటి, మొన్న ఓ పిటిషన్ వేశానని చెప్పాడు.

హోంమంత్రిని కలిసిన దత్తాత్రేయ

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను సికింద్రాబాదు ఎంపీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కలిశారు. నల్గొండ జిల్లా ఎన్ కౌంటర్ పైన వివరణ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+