చంచల్‌గూడ జైలుకు.. విక్రమ్‌గౌడ్, అక్కడే చికిత్స
మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. విక్రమ్‌కు చంచల్‌గూడ జైలులోనే చికిత్సనందించనున్నారు. విక్రమ్‌కు జైలులోనే చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. విక్రమ్‌గౌడ్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి విక్రమ్‌గౌడ్‌కు 14 రోజులు రిమాండ్ విధించారు.
విక్రమ్‌కు వెన్నెముకలో తూటా ఉన్నందున మరికొన్ని రోజులు చికిత్స అవసరమని అతని తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు.. విక్రమ్‌గౌడ్‌కు ఉస్మానియా లేదా గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందించాలని జైళ్ల శాఖను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో వైద్యులు విక్రమ్‌కు చంచల్‌గూడ జైలులోనే చికిత్సనందించనున్నారు. విక్రమ్‌కు జైలులోనే చికిత్స చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications