Vinay Bhanu Reddy: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో యాదాద్రి జిల్లా వాసి మృతి..
హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తెలంగాణ వ్యక్తి చనిపోయాడు.
ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన లెఫ్టి నెంట్ కల్నల్ వినయ్ భానురెడ్డి(Vinay Bhanu reddy) ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో పైలట్ పేరు జయంత్ అని ఆర్మీ తెలిపింది. వీరిద్దరు హెలికాప్టర్ లో గురువారం ఉదయం 9 గంటలకు అరుణాచల్ ప్రదేశ్ లోని సాంగే నుంచి అస్సాంలోని సాంటిపూర్ జిల్లా మిస్సమరికి బయల్దేరారు.
ఉదయం 9 గంటల 15 నిమిషాల ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కు ఏటీసీ(ATC)తో సంబంధం కోల్పోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సిగ్నల్స్ కోల్పోయిన కొద్దిసేపటికే పశ్చిమ కమెంగ్ జిల్లాలోని జమ్డిలాక సమీపంలో కూలిపోయినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు.
హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ ఉండవని.. పొగమంచు కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని అధికారులు తెలిపారు.

పొగమంచు వల్ల 5 మీటర్ల దూరం మాత్రమే కనిస్తుందని.. అయితే హెలికాప్టర్ కూలిన చోట మంటలు రావడంతో గుర్తించామన్నారు.హెలికాప్టర్ కూలినట్లు స్థానికంగా ఉండే బంగ్జాలేవ్ గ్రామస్థులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆర్మీకి విషయాన్ని తెలిపారు. వినయ్ భాను రెడ్డి మృతితో బొమ్మలరామారంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
వినయ్ భాను రెడ్డి సైన్యంలో చేరి భరత మాతకు ఎంతో సేవ చేశారని గ్రామస్థులు కొనియాడారు. ఉన్నతమైన స్థానానికి ఎదిగిన భాను హెలికాప్టర్ ప్రమాదంతో కన్నమూయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వినయ్ భాను రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వీరు మల్కాజిగిరిలో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications