అర్ధరాత్రి తానతందానా.. రేవ్ పార్టీలో ప్రముఖులు..! పోలీసుల బ్రేక్
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో రేవ్ పార్టీకి బ్రేకులు వేశారు పోలీసులు. శామీర్ పేటలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ రిసార్ట్ లోని ప్రైవేట్ వ్యక్తులకు చెందిన విల్లాపై ఎస్‌వోటీ పోలీసులు దాడిచేశారు. అక్కడ రేవ్ పార్టీ పేరిట కొందరు చిందులు వేస్తుండటంతో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.

గజ్వేల్ ప్రాంతానికి చెందిన ఆరుగురు వ్యక్తులతో పాటు హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు ముంబయికి చెందిన ఒక యువతితో పాటు హైదరాబాద్ కు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రేవ్ పార్టీలో కొందరు ప్రముఖ వ్యక్తులున్నట్లు తెలుస్తోంది. వారి పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications