Viral Video: యువకుడి ప్రాణం తీసిన ‘స్పీడ్’ బ్రేకర్, షాకింగ్ విజువల్స్

హైదరాబాద్: అతివేగం ప్రమాదకరమని, ప్రాణం తీస్తుందని తెలిసినా.. కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ మృత్యుబారినపడుతున్నారు. మరికొందరు వారితోపాటు ఇతరుల ప్రాణాలు కూడా తీస్తున్నారు. తాజాగా, ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

కూకట్‌పల్లి పరిధిలోని వివేకానంద నగర్ ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్లాడు. స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపుతప్పడంతో పల్టీలు కొడుతూ పడిపోయాడు. తీవ్రగాయాలైన యువకుడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

 Viral video: A Young man dies after lost control of his two wheeler, due to over speed

అయితే, అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.


కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు అతి వేగం ప్రమాదకరమని చెబుతున్నారు. అయితే, అక్కడ అంతపెద్ద స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఏర్పాటు చేశారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+