కృష్ణమ్మ పరవళ్లు.. నాగార్జున సాగర్ అందాలు.. సందర్శకుల రాకతో ట్రాఫిక్ జామ్..!
నల్గొండ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ సరికొత్త అందాలు సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో సాగర్ జలకళతో తొణికిసలాడుతోంది. ఆ క్రమంలో గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. పైనుంచి కిందకు జాలువారుతున్న నీటి అందాలు చూసేందుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. అపురూప దృశ్యం చూసి పరవశించిపోతున్నారు.
ఆదివారం నాడు సెలవు దినం కావడంతో చాలామంది పర్యాటకులు నాగార్జున సాగర్‌కు పోటెత్తారు. దాంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పిల్లర్ పార్క్ నుంచి బస్టాండ్ ఏరియా వరకు ఫుల్లుగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే సందర్శకులకు ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తూ వాహనాల రాకపోకలను క్లియర్ చేస్తున్నారు.

ఈ నెల 9వ తేదీన నాలుగు గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు కిందకు విడుదల చేయగా.. ఒక్కో గేటు నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. మొదట 6వ నెంబర్ గేటు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. అనంతరం వరుసగా 7,8,9 గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు వదిలారు. శ్రీశైలం జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. 9వ తేదీ నాటికి అది 880 అడుగులకు చేరుకుంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి కాస్తా ముందుగానే జలాశయం నిండిందని అధికారులు తెలిపారు. ఆ మరునాడే మరో 6 గేట్లు ఎత్తి మొత్తం 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications