మళ్లీ టిఆర్ఎస్‌లోకి మాజీ ఎంపి వివేక్: స్వయంగా కలిసి ఆహ్వానించిన హరీశ్!

హైదరాబాద్: కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ గాలి వివేక్ తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. శనివారం రాత్రి ఎంపి కేశవరావు నివాసంలో జరిగిన ఓ భేటీలో తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో పాటు వివేక్ కూడా హాజరు కావడం కొత్త చర్చకు తెరలేపింది.

వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించిన హరీశ్ రావు, వరంగల్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ తరఫున బరిలోకి దిగాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు వివేక్ సానుకూలంగా స్పందించినట్టు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవలే వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్‌ 4తో నామినేషన్‌ గడువు ముగియనుంది. ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి వరంగల్‌ లోక్‌సభకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Vivek likely to join TRS

ఈ నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక జరగుతోంది. అక్కడ బలమైన అభ్యర్థి ఎంపిక కోసం కేకే నివాసంలో శనివారం రాత్రి కీలక సమావేశం జరిగినట్లు తెలియవచ్చింది. ఈ భేటీలో హరీష్‌రావు, కేకే, వివేక్‌ పాల్గొన్నారు.

కాగా, అదివారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. వివేక్‌తోపాటు ప్రొ. సాంబయ్య, ఎర్రొళ్ల శ్రీనివాస్‌, రవికుమార్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్‌ లేదా రవికుమార్‌ ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న వివేక్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై టిపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలను అడిగి వివరాలను తెలుసుకున్నారని సమాచారం. అయితే, టిఆర్ఎస్‌లోకి వివేక్ ప్రవేశంపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుంది.

టిఆర్ఎస్ పార్టీలో చేరడం లేదు: వివేక్

తాను టిఆర్ఎస్ పార్టీలో చేరడం లేదని మాజీ కాంగ్రెస్‌ ఎంపీ వివేక్‌ స్పష్టం చేశారు. శనివారం రాత్రి రాజ్యసభ సభ్యుడు కేకే నివాసంలో జరిగిన సమావేశంలో వివేక్‌ను టిఆర్‌ఎస్‌లో చేరమని మంత్రి హరీష్‌రావు ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. పార్టీ తరఫున వరంగల్‌ లోక్‌ సభ అభ్యర్థిగా బరిలోకి దిగాలని కోరారు.

ఈ నేపథ్యంలో వచ్చిన టిఆర్ఎస్ పార్టీలో చేరతారనే వార్తలను వివేక్‌ ఖండించారు. తాను టిఆర్‌ఎస్‌లో చేరడంలేదని, కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆయన ఆదివారం మీడియాకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+