‘రామ్ అన్నా.. సూపర్ ఇంప్రెసివ్’: కెటిఆర్ ట్విట్టర్‌లో వివేక్ ఒబెరాయ్ ప్రశంస
హైదరాబాద్: ‘వావ్! సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా! మీ కృషి చాలా బాగుంది' అంటూ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావుపై ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించారు. అపాచీ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రకటించగానే హైదరాబాద్‌తో చిన్ననాటి నుంచి సంబంధం ఉన్న ఒబెరాయ్ స్పందించారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషిని ఒబెరాయ్ ప్రశంసించారు. తెలంగాణను టెర్రిఫిక్‌గా మారుస్తున్నారని కూడా ఒబెరాయ్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్‌లో అపాచీ హెలికాప్టర్ల తయారీ కోసం బోయింగ్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సంస్థలు జాయింట్ వెంచర్ ప్రారంభిస్తున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ట్వీట్ చేయడంతో.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ స్పందించారు.
Wow!Super impressive Ram Anna! Bcoz of ur efforts its not just #HappeningHyderabad but it's also #TerrificTelengana https://t.co/WHJvukRspj
— Vivek Oberoi (@vivek_oberoi) November 9, 2015 ‘సూపర్ ఇంప్రెసివ్ రామ్ అన్నా' అంటూ తన ట్వీట్ మొదలుపెట్టారు. మీరు చేస్తున్న ప్రయత్నాల వల్ల 'హైదరాబాద్ హ్యాపెనింగ్' మాత్రమే కాదు, 'టెర్రిఫిక్ తెలంగాణ' సాధ్యమవుతోందని చెప్పారు. దానికి మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.
Thanks Vivek Bhai! Appreciate your kind words. How is our Hyderabadi Oberoi Saab doing? Convey my regards please https://t.co/w8D4iBVlyH
— K Taraka Rama Rao (@KTRTRS) November 10, 2015 వివేక్ భాయ్‌కి ధన్యవాదాలు చెబుతూనే, తమ హైదరాబాదీ ఒబెరాయ్ సాబ్ ఏం చేస్తున్నారని అడిగారు. వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ కూడా ఒకప్పుడు బాలీవుడ్‌లో రాజ్యమేలినవారే. ఆయన సిసలైన హైదరాబాదీ. ఆయనకు తన వందనాలు అందజేయాలని కేటీఆర్ కోరారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications