పరిటాల శ్రీరామ్ పెళ్లికి వివేక్ ఒబెరాయ్: మళ్లీ వస్తానని చెప్పిన కేసీఆర్
పరిటాల శ్రీరామ్ వివాహానికి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలో వివేక్.. పరిటాల రవి పాత్రను పోషించారు.
అనంతపురం: పరిటాల శ్రీరామ్ వివాహానికి బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాలో వివేక్.. పరిటాల రవి పాత్రను పోషించారు.

పెళ్లికి వివేక్ ఒబెరాయ్
ఆ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్ర పేరు ప్రతాప్ రవి. ఆ చిత్రంలో నటించినప్పటి నుంచి వివేక్ ఒబెరాయ్‌కు పరిటాల కుటుంబంతో మంచి అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే మంత్రి సునీత తన కుమారుడు శ్రీరామ్ వివాహానికి ఆయనను ఆహ్వానించారు.

పుట్టపర్తికి కుటుంబంతో వస్తా
పుట్టపర్తికి కుటుంబంతో వస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. తాను అనంతపురం ఇంచార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు పుట్టపర్తికి వచ్చానని, మళ్లీ ఇంతకాలానికి ఇక్కడకు వచ్చినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

పరిటాల శ్రీరామ్ పెళ్లికి వస్తూ
పరిటాల శ్రీరామ్ వివాహానికి హాజరయ్యేందుకు విమానంలో ఆయన బేగంపేట నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. త్వరలో కుటుంబసమేతంగా పుట్టపర్తికి వస్తానని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు.

బుక్కపట్నం చెరువు గురించి అడిగిన కేసీఆర్
పుట్టపర్తి సమీపంలో ఉన్న బుక్కపట్నం చెరువు గురించి ఎమ్మెల్యే పల్లెను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయి? పంటల పరిస్థితి ఏమిటని ఆరా తీశారు. తర్వాత వెంకటాపురం వెళ్లి పెళ్లికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications