ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ఈ ఆన్‌లైన్ పోర్టల్ రక్ష!
బెంగళూరు: చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకునే వారిని మనం రోజూ పత్రికలలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. నిన్ననే టీవీ యాంకర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రముఖులు ఆత్మహత్య చేసుకుంటే వార్తల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. రోజు పేపర్లలో ఆత్మహత్యలు చూస్తూనే ఉంటాం.
ఈ నేపథ్యంలో ఆత్మహత్యలను ఆపాలనే సదుద్దేశ్యంతో రిచా సింగ్ అనే యువతి కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిన వారిని దాని నుంచి కాపాడేందుకు రిచా ఓ ఆన్ లైన్ పోర్టల్‌ను తీసుకు వచ్చింది. అది యువర్ దోస్త్ డాట్ కామ్. (www.yourdost.com)
ఈ పోర్టల్‌లో సైకాలజిస్టులు, సలహాదారులు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా జీవితం పైన విరక్తి కలిగితే ఈ పోర్టల్ సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పిస్తుంది.

మీడియాలో వస్తున్న సమాచారం మేరకు... ఈ పోర్టల్ ప్రారంభించిన రిచా ఐఐటి గౌహతిలో చదివింది. ఉద్యోగం దొరకక ఒత్తిడిలో ఆమె స్నేహితురాలు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమెకు ఈ ఆలోచన వచ్చిందని తెలుస్తోంది.
ప్రొఫెషనల్‌గా, అకడమిక్‌గా, వ్యక్తిగతంగా ఒత్తిడిలో కూరుకుపోయిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే పోర్టల్ తమది అని రిచా సింగ్ చెబుతున్నారు.
మీ వ్యక్తిగత భావోద్వేగాలకు 'యువర్ దోస్త్' పర్సనల్ ట్రెయినర్ అని, విశ్వసించదగిన ఆన్‌లైన్ ఫ్రెండ్ అని, ఈ పోర్టల్ ద్వారా మీరు నిపుణులతో మాట్లాడవచ్చునని.. ఆ వెబ్‌సైట్ చెబుతోంది. ప్రొఫెషనల్‌గా నిష్ణాతులైన కౌన్సెలర్లు మీకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటారని పేర్కొంటుంది.
పని ఒత్తిడి, రిలేషన్‌షిప్, ప్రతిష్ట... తదితర ఏ విషయాల్లోనైనా అండగా ఉంటామని ఈ పోర్టల్ చెబుతోంది. అంతేకాదు, నిపుణులతో ఈ పోర్టల్ ద్వారా చాటింగ్ చేయవచ్చు. అపాయింటుమెంట్ తీసుకోవచ్చు. ఇది 24X7 గంటలు అందుబాటులో ఉంటుంది. ఒత్తిడిలో ఉండేవారిలో ధైర్యం నూరిపోసే ఈ పోర్టల్.. ఎవరి సమాచారాన్ని అయినా రహస్యంగా ఉంచుతుంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications