ఎర్రబెల్లి సీటులోనూ దయాకర్ మెజారిటీ: ఫలించిన కెసిఆర్ వ్యూహం

వరంగల్: ప్రతిపక్షాలను చావుదెబ్బ తీస్తూ వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ టిఆర్ఎస్ మెజారిటీ ఓట్లు సాధించింది. ప్రతిపక్షాల అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు.

గత సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోకసభ నియోజకవర్గంలోని ఏడు ఆసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ విజయం సాధించగా, పాలకుర్తిలో మాత్రం టిడిపి విజయం సాధించింది. 2014 ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ టిఆర్ఎస్ 4 లక్షల 59 వేల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించింది. సాధారణంగా ఉప ఎన్నికలు అధికారంలో పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ, ఇంత భారీ మెజారిటీ ప్రతిపక్షాలను చావు దెబ్బ తీసినట్లే అనుకోవచ్చు.

టిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యూహం వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో ఫలించిందని అంటున్నారు. టిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతోంది. ఈ స్థితిలో ప్రతిపక్ష కాంగ్రెసు, బిజెపి, టిడిపిలు కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ వచ్చాయి. కెసిఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ వచ్చాయి. ఈ స్థితిలో వరంగల్ లోకసభ ఉప ఎన్నిక కెసిఆర్‌కు సవాల్‌గా నిలిచింది.

Warangal bypoll: KCR strategy succeeded

వరంగల్ ఉప ఎన్నికలో విజయం మాట సరే, మెజారిటీ తగ్గినా కూడా తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడడానికి అవకాశం ఉంటుందనే భావనతో కెసిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిజానికి, వరంగల్ ఉప ఎన్నికలో ఆయన ప్రచారం చేయకూడదని అనుకున్నారు. అయితే, ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆయన ప్రచారంలో పాల్గొన్నట్లు చెబుతారు.

వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో ఏ చిన్న విషయాన్ని కూడా విస్మరించకూడదని ఆయన పార్టీ నాయకులకు సూచిస్తూ వచ్చారు. అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నాయకులకు తగిన సూచనలు చేస్తూ వచ్చారు. మెజారిటీ తగ్గినా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే విమర్శలకు ప్రతిపక్షాలు పూనుకుంటాయనే ఉద్దేశంతో ఆయన ప్రతి విషయాన్ని పట్టించుకుని వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. అదే ఫలితం ఇచ్చిందని కూడా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+