9కమిషనరేట్ల ఏర్పాటుకు వరంగల్ స్ఫూర్తి: సీపీ సుధీర్‌బాబు
తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదట ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉత్తమ ఫలితాలు సాధించిన స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్..
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదట ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉత్తమ ఫలితాలు సాధించిన స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో మరో 9 పోలీసు కమిషనరేట్లు ఏర్పాటు చేశారని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. కమిషనర్ మ్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో దాన్ని వినియోగించుకొని నేరస్తులను గుర్తించడం వల్ల నేరాల సంఖ్య తగ్గిందన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు జరిగే ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతోందన్నారు. వరంగల్ నగరం స్మార్ట్ సిటీగా ఎంపిక కావడంలో సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో దోహద పడిందన్నారు. అప్పటి వరకు స్మార్ట్ సిటీ కోసం దేశంలో పలు నగరాలు పోటీ పడినప్పటికీ.. నగరంలో ఏర్పాటు చచేసిన సీసీ కెమెరాలతో అదనపు అర్హత తోడై స్మార్ట్‌సిటీ పథకంలో చోటు దక్కిందన్నారు.

ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలని సీఎం ఆదేశించడంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలులోకి వచ్చిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరస్తుల నుంచి నిజాలు రాబట్టడం కొంత ఇబ్బంది అవుతోందన్నారు. అయినా సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను రుజువు చేస్తున్నందున.. నేరాలు చేసే వారి సంఖ్య తగ్గుతోందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులు, వేయికి పైగా ఎన్‌బీడబ్ల్యూ వారెంట్లను 45 రోజుల్లో పరిష్కారం చేశామని తెలిపారు. ఎన్‌బీడబ్ల్యూలు లేని కమిషనరేట్‌గా రాష్ట్రంలో వరంగల్‌కు గుర్తింపు వచ్చిందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నగరంలో చైన్ స్నాచింగ్‌లు తగ్గాయన్నారు.
11వేలకు పైగా సీసీ కెమరాలు
కమిషనరేట్‌లోని 19 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పట్టణాలు, మండల కేంద్రాల్లో 11,893 సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు సీపీ తెలిపారు. వీటికి అదనంగా 1,017 కెమరాలు బిగించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 1,719 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాల్లోని వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, కాలనీలు, బ్యాంకులు, లాడ్జీల్లో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఆదేశించామన్నారు.












Click it and Unblock the Notifications