పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై అత్యాచారం: వరంగల్ కార్పొరేటర్ భర్త అరెస్ట్
వరంగల్: అత్యాచారం కేసులో వరంగల్‌కు చెందిన ఓ కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేటర్ భర్త శిరీష్ తనను పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై సెప్టెంబర్ 23వ తేదీన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కార్పొరేటర్ భర్తపై అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేసినట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు. అప్పటినుంచి శిరీష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శిరీష్‌ను గురువారం అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితుడిని పరకాల జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన వరంగల్ జిల్లాలో కలకలం సృష్టించింది.

ఆస్తి కోసం తండ్రి ప్రాణం తీశారు
ఆస్తి కోసం కన్నతండ్రి ప్రాణం తీశారు కుమారులు. ఆస్తి కోసం దారుణంగా హత్య చేశారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది. జోగిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లికి చెందిన పెద్దగొల్ల పాపయ్య(60)కు విఠల్, నరేశ్, కృష్ణ, చిరంజీవి అనే నలుగురు కుమారులున్నారు. కృష్ణ వట్పల్లిలో నివాసం ఉంటుండగా, మిగితా ముగ్గురూ గ్రామంలోనే విడిగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు.
భార్య నాలుగేళ్ల క్రితమే మృతి చెందడంతో పాపయ్య పెద్ద కుమారుడు విఠల్ వద్ద ఉంటున్నాడు. తండ్రి పేరిట ఉన్న 9 ఎకరాల పొలం పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. పెద్ద కుమారుడు విఠల్‌కు మిగితా వారికంటే కొంత భూమి ఎక్కువగా ఇస్తానని పాపయ్య చెప్పడంతో.. నరేష్, కృష్ణ అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నరేష్, కృష్ణ బ్రాహ్మణపల్లికి చేరుకున్నారు. ఇంట్లోని మొదటి అంతస్తులో తండ్రి పాపయ్య వద్దకు వెళ్లి ఇటుకతో తలపై బలంగా మోదారు. కింది గదిలో పడుకున్న విఠల్ అరుపులు విని పైకి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో తండ్రి మృతదేహం కనిపించింది. నిందితులిద్దరూ అక్కడ్నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన వ్యక్తి మృతి
హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ మొదటి అంతస్తు నుంచి దూకిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ పరిధి కువకొండకు చెందిన బీమా(45) దినసరి కూలీగా నగరంలో పనిచేస్తున్నాడు. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన అతడు.. కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయిన పలు మెట్రో స్టేషన్ల వద్ద తిరుగుతున్నాడు. గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్ మొదటి అంతస్తు నుంి దూకడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. రాజీవ్ చౌక్ వద్ద పికెట్ విధుల్లో ఉన్న పోలీసులు 108 వాహనంలో అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రతిలో చికి్తస పొందుతూ అతడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు.












Click it and Unblock the Notifications