వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్ లోకసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల: నో నారాయణఖేడ్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరంగల్ లోకసభ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ నెల 28వ తేదీన వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది.

పోలింగ్ నవంబర్ 21వ తేదీన జరుగుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ 4 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 7. నవంబర్ 5వ తేదీన నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 24వ తేదీన జరుగుతుంది.కాంగ్రెసు శాసనసభ్యుడు కిష్టారెడ్డి మృతితో ఖాళీ అయిన నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్‌ను మాత్రం ఎన్నికల కమిషన్ విడుదల చేయలేదు.

Warangal Lok Sabha bye poll schedule announced

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వానికి, పార్టీకి వరంగల్ లోకసభ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. అంతే కాకుండా, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకం. ప్రతిపక్షాలు టిఆర్ఎస్‌ను ఓడించడానికి ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

వామపక్షాలు గాలి వినోద్ కుమార్‌‌ను వరంగల్ లోకసభకు తమ అభ్యర్థిగా ప్రకటించాయి. బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలికో దింపుతాయి. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ల అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది.

English summary
Election Commission released Warangal Lok Sabha bye poll schedule today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X