వరంగల్, ఖమ్మం, అచ్చంపేట టిఆర్ఎస్‌వే: జగన్ పార్టీ గెలిచిన చోట, టిడిపి బేజారు
వరంగల్: వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీకి ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు బుధవారం జరిగింది. వరంగల్‌లో 58, ఖమ్మంలో 50 కార్పోరేషన్లు ఉన్నాయి. అచ్చంపేటలో 20 వార్డులు ఉన్నాయి. వీటికి లెక్కింపు జరిగాయి.
ఈ ఎన్నికల ఫలితాలు తెరాసలో కొత్త ఉత్సాహం తీసుకు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఊరట లభించింది. బిజెపి, టిడిపిలకు మాత్రం చుక్కెదురైంది. ఇటీవలి ఎన్నికల బాధ్యతలను టిడిపి తరఫున రేవంత్ రెడ్డి భుజానికెత్తుకుంటున్నారు. కానీ ఆయన విఫలమవుతున్నారు.

ఇప్పటికే ఖమ్మం కార్పోరేషన్, అచ్చంపేట మున్సిపాలిటినీ టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరంగల్లో టిఆర్ఎస్ 44, కాంగ్రెస్ 4, స్వతంత్రులు 1, బిజెపి 1, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.
గెలుపుపై కెసిఆర్ స్పందన
వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలో టిఆర్ఎస్ ఘన విజయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్పందించారు. గెలిపించిన ప్రజలకు కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలనన్నింటిని నిలబెట్టుకుంటామని చెప్పారు. మా పాలనను ఓటర్లు దీవించినట్లుగా భావిస్తున్నామన్నారు.
- ఖమ్మంలోని మొత్తం 50 స్థానాలలో టిఆర్ఎస్ 34, కాంగ్రెస్ 10, లెఫ్ట్ 4, వైసిపి 2 స్థానాలు దక్కించుకున్నాయి. టిడిపి ఖాతా కూడా తెరవలేదు.
- పదకొండు గంటల సమయానికి వరంగల్లో టిఆర్ఎస్ 36, కాంగ్రెస్ 3, బిజెపి 1, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. ఖమ్మంలో టిఆర్ఎస్ 32, కాంగ్రెస్ 10, లెఫ్ట్ 4, వైసిపి రెండు స్థానాల్లో గెలిచింది.
- వరంగల్లో టిఆర్ఎస్ 30, స్వతంత్రులు 3, లెఫ్ట్ 2, కాంగ్రెస్ 2, బిజెపి 1 గెలుచుకుంది.
- ఖమ్మంలో టిఆర్ఎస్ 30, కాంగ్రెస్ 6, వైసిపి 2, సిపిఎం 2 స్థానాల్లో గెలుపొందాయి.
- పదిన్నర గంటల సమయానికి ఖమ్మంలో టిఆర్ఎస్ 30 స్థానాలు గెలుచుకుంది. 50కిగాను 30 స్థానాలు గెలుచుకొని ఖమ్మం కార్పోరేషన్ కైవసం చేసుకుంది.
- వరంగల్లో 30 స్థానాలు గెలుచుకోవడం ద్వారా వరంగల్ కార్పోరేషన్‌ను తెరాస కైవసం చేసుకుంది.
- ఖమ్మంలో టిఆర్ఎస్ 18, కాంగ్రెస్ 2, లెఫ్ట్ 1, వైసిపి 1 స్థానంలో గెలుపొందాయి.
- పది గంటల సమయానికి వరంగల్లో టిఆర్ఎస్ 30, కాంగ్రెస్ 1, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.
- వరంగల్లో 40 స్థానాలు గెలుచుకోవడం ద్వారా వరంగల్ కార్పోరేషన్‌ను తెరాస కైవసం చేసుకుంది.
- ఖమ్మంలో టిఆర్ఎస్ 18, కాంగ్రెస్ 2, లెఫ్ట్ 1, వైసిపి 1 స్థానంలో గెలుపొందాయి.
- పది గంటల సమయానికి వరంగల్లో టిఆర్ఎస్ 40, కాంగ్రెస్ 1, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.
- తొమ్మిదింపావు సమయానికి ఖమ్మంలో టిఆర్ఎస్ 18, కాంగ్రెస్ 1, వైసిపి 1 గెలుచుకున్నాయి. వరంగల్లో టిఆర్ఎస్ 10, కాంగ్రెస్ 1, సిపిఎం ఒకటి గెలుచుకున్నాయి.
- వరంగల్లో టిఆర్ఎస్ 4, కాంగ్రెస్ ఒకటి, సిపిఎం ఒక స్థానంలో గెలిచాయి.
- తొమ్మిది గంటల సమయానికి టిఆర్ఎస్ 10 స్థానాల్లో, వైసిపి 1 స్థానంలో గెలిచాయి.
- ఖమ్మంలో టిఆర్ఎస్ నాలుగు, వైసిపి 1 స్థానంలో గెలిచింది.
- వరంగల్‌లో ఎనిమిది నలభై అయిదు నిమిషాల వరకు.. టిఆర్ఎస్ రెండు, కాంగ్రెస్ 1, ఇతరులు ఒక స్థానం గెలుచుకున్నారు.
- వరంగల్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ 2 స్థానాలు గెలుచుకుంది.
- అచ్చంపేటలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఐక్య కూటమిగా పోటీ చేశాయి. అయినప్పటికీ సత్తా చాటలేకపోయాయి.
- అచ్చంపేటలో టిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 20 స్థానాలకు 20 టిఆర్ఎస్ గెలుచుకుంది.
- అచ్చంపేట మున్సిపాలిటి టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉదయం ఎనిమిదింపావు వరకు 20 స్థానాలకు గాను 12 స్థానాల్లో నెగ్గింది.
- అచ్చంపేట పంచాయతీలో 8 వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.












Click it and Unblock the Notifications