వరంగల్ నిట్ విద్యార్థికి ఎంఎన్‌సీలో కొలువు: ఊహించని ప్యాకేజీ!
వరంగల్ నిట్‌లో ఈసీఈ విభాగంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి ఊహించని ప్యాకేజీతో ఓ బహుళజాతి కంపెనీలో కొలువు లభించింది.
హన్మకొండ: అత్యధిక ప్లేస్‌మెంట్లతో దూసుకుపోతున్న వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్‌ఐటీ)లో ఈసీఈ విభాగంలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి ఊహించని ప్యాకేజీతో ఓ బహుళజాతి కంపెనీలో కొలువు లభించింది. అతనికి వార్షిక జీతం రూ.80 లక్షల ప్యాకేజీ ఇచ్చి అమెరికాకు చెందిన మోర్గాన్ స్టాన్లీ కంపెనీ ఎంపిక చేసుకుంది.
నిట్ క్యాంపస్‌లో చేపడుతున్న ప్రాంగణ ఎంపికల్లో భాగంగా అత్యధిక ప్యాకేజీతో నిట్ విద్యార్థికి ఈ కొలువు లభించడం విశేషం. నిట్‌లో చదువుతున్న విద్యార్థులు 90 శాతం మంది కొలువులకు ఎంపికవుతున్నట్లు నిట్ ప్రొఫెసర్లు తెలిపారు. ఐదేళ్లుగా ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పెప్సీకో తదితర కంపెనీలలో ఏడాదికి రూ.50 నుంచి 65 లక్షల ప్యాకేజీలతో విద్యార్థులు కొలువులకు ఎంపికవుతున్నారని చెప్పారు.

కంప్యూటర్‌సైన్స్, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల విద్యార్థులు రూ.10లక్షల కంటే అధిక ప్యాకేజీలతో 90శాతానికి పైగా ప్రాంగణ ఎంపికల్లో కొలువులు దక్కించుకుంటున్నారని వెల్లడించారు.
సాధారణంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ సంస్థలు అత్యధిక ప్యాకేజీలు ఆఫర్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ, ఈసారి మాత్రం ఈసీఈ విద్యార్థిని స్టాక్ ఎక్చేంజ్(ఫైనాన్షియల్) కంపెనీ అత్యధిక ప్యాకేజీతో ఎంపిక చేసుకోవడం విశేషమనే చెప్పుకోవాలి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications