వరంగల్,యాదాద్రి భువనగిరి హైవేపై తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ.!అందుబాటులోకి రానున్న నాగోల్ ఫ్లైఓవర్.!
హైదరాబాద్: హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు పూర్తి మౌలిక వసతులు కల్పించేందుకు జిహెచ్ఎంసి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్.ఆర్.డి.పి తో చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్నదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాహన రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ముందుగా ప్రాధాన్యతనిచ్చి అవసరమున్న చోట ఫ్లై ఓవర్లు, ఆర్ ఓ బి లు, అండర్ పాస్ లు నగరానికి నలువైపులా నిర్మించి ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు నగర పాలక సంస్థ నడుంబిగించింది.

ఫ్లై ఓవర్లపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ..
ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన మౌళిక సదుపాయాల కార్యక్రమాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. నాగోల్ లో చేపట్టిన ఫ్లై ఓవర్ త్వరలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా నేరుగా ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వరకు, అక్కడి నుండి వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు సికింద్రాబాద్, ఇ.సి.ఐఎల్ ప్రాంతాలకు వెళ్లే వారికి వారి వారి ప్రయాణం ఎంతో సులభతరం అవుతుందని నగర పాలక సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వరంగల్, యాదాద్రికి సాఫీ ప్రయాణం.
జిహెచ్ఎంసి నిధులతో చేపడుతున్న ఎస్.ఆర్.డి.పి ద్వారా మొత్తం 41 వివిధ రకాల మౌళిక సదుపాయాలకు సంబందించిన కార్యక్రమాలను నగర పాలక సంస్థ ఉన్నతాదికారులు చేపట్టారు. జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి, హెచ్.ఎం.డి.ఏ ద్వారా మరో ఆరు రార్యక్రమాలు కలిపి మొత్తం 47 పనులకు శ్రీకారం చుట్టారు. అందులో ఇప్పటి వరకు 31 పనులు పూర్తయ్యాయని అధికారలు వివరించారు. అందులో భాగంగా నాగోల్ లో చేపట్టిన ఫ్లై ఓవర్ పనులు త్వరలో పూర్తయ్యి అందుబాటులోకి రానున్నదని అధికారులు స్పష్టం చేసారు.

వేగవంతమైన ప్రయాణం..
ఇప్పటివరకు ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 32 పనులు పూర్తవుతాయనొ, దీంతో 16 ఫ్లై ఓవర్ ల ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించబడిందనొ జాహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీటితో పాటు 7 ఆర్ ఓ బి లు, 5 అండర్ పాస్ లు అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మెరుగు పడిందని తెలిపారు. నాగోల్ లో చేపట్టిన ఫ్లైఓవర్ ను భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ కోసం 43.58 కోట్ల రూపాయల వ్యయం కాగా, సివిల్ వర్క్స్ చేపట్టడానికి మరో 69 కోట్ల రూపాయల వ్యయంతో 990 మీటర్ల ఫ్లై ఓవర్ కారిడార్ ను చేపట్టినట్టు అధికారులు వివరించారు.

సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ..
నాగోల్ ప్రాంతంలో 200 ఫీట్లు గల మాస్టర్ ప్లాన్ ను ప్రతిపాదించొన అధికారులు రెండు మార్గాలను కలిగిన ఫ్లై ఓవర్ 24 మీటర్ల వెడల్పు 6 లైన్ల బై డైరెక్షన్ క్యారేజ్ మార్గాన్ని నిర్మించినట్టు నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్పష్టం చేసారు. 23 పిల్లర్స్, 22 స్పాన్స్ తో 600 మీటర్ల వయాడక్ట్ పొజిషన్ 300 మీటర్ల అప్రోచ్ పొడవుతో ఆర్.ఇ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్ వలన ఎల్బీనగర్ నుండి ట్రాఫిక్ కు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తద్వారా డీజిల్ ఆదా, వాహన వేగం పెరగడం ట్రావెల్ సమయం తగ్గడమే కాకుండా వాహన నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం ఉంటుందని రవాణా అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications