నారాయణ కాలేజీలో వార్డెన్ ఆత్మహత్య: ప్రేమ వైఫల్యమే కారణమా?
హైదరాబాద్: బై...ఇదే లాస్ట్‌డే....అంటూ ఓ యువతికి ఫేస్‌బుక్‌లో మేసేజ్ పెట్టిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వైఫల్యం కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడలో గల నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఆదివారం చోటు చేసుకొంది.
ఇన్‌స్పెక్టర్ ఉమేందర్ తెలిపిన వివరాల ప్రకారం - వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం కొనాపురానికి చెందిన వేముల విష్ణు (27) ఏడాది క్రితం బతుకు దెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. హైదర్‌గూడలోని నారాయణ కాలేజీలో వార్డెన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అయితే గత కొంత కాలంగా ఓ అమ్మయితో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు సమాచారం.
రోజు మాదిరిగానే శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం తన గదిలో నిద్రించాడు. తెల్లవారు అతని గది తలుపు తేరుచుకోకపోవడంతో హాస్టల్‌లో ఉండే వార్డెన్ గమనించి గదిలోపలికి వెళ్లి చూడగా, విష్ణు ఫ్యానుకు ఉరేసుకొని ఉన్నాడు. యజమానికి సమాచారం అందించాడు.

కుటుంబ సభ్యులు, రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని గదిని పరిశీలించారు. హాస్టల్లోని కొందరు విద్యార్థులు అతని కంప్యూటర్ ఆన్‌చేసి చూడగా ఫేస్‌బుక్‌లో బై...ఇదే లాస్ట్‌డే అంటూ ఓ యువతికి మేసేజ్ పెట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు తెలిపారు.
పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురికి తరలించారు. అతని తల్లి జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్ పరిశ్రమపై భారం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం..












Click it and Unblock the Notifications