అమ్మాయికి సెల్యూట్-అబ్బాయిలందరూ అలా కాదు(వీడియో)
హైదరాబాద్: ఇటీవలి కాలంలో అమ్మాయిలకు అబ్బాయిల నుంచి వేధింపులు అధికమయ్యాయి. ఒంటరిగా వెళ్లినా, ఇద్దరు ముగ్గురు కలిసిన వెళ్ళినా.. ఇంటి నుంచి బయటికెళితే.. వేధింపులు తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే, ఇక్కడ అందరు అబ్బాయిలు.. అమ్మాయిలను వేధింపులకు గురిచేయరు. అంతేగాక, బాధిత అమ్మాయిలకు అండగా కూడా నిలబడతారు.
ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో.. ఓ వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకుని ఓ షార్ట్ ఫిలిం తీశారు కొందరు యువతీయువకులు. ఈ లఘు చిత్రంలో తన గమ్యస్థానం చేరేందుకు ఓ యువతి ఓ ఆటోలో ఎక్కుంది. అప్పటికే అందులో ముగ్గురు యువకులు ఉంటారు.

కాగా, ఆ అమ్మాయి కూర్చున్న తర్వాత ఆమె పక్కనున్న అబ్బాయి ఆమెను వేధించడం మొదలుపెడతాడు. ఆమెను తాకుతూ, ఆమె మీద పడుతూ ఆమెను వేధింపులకు గురిచేస్తాడు. దీంతో ఆమెకు కోపం వచ్చి తీవ్రంగా తిడుతుంది. మీ మగళ్లంతా ఇంతేనంటూ దుమ్మెత్తిపోస్తుంది.
ఇది గమనించిన మరో యువకుడు.. వేధింపులకు దిగిన యువకుడ్ని హెచ్చరిస్తాడు. ఎందుకు వేధిస్తున్నావంటూ నిలదీస్తాడు. దీంతో అతడు ఆటో నుంచి దూకి పారిపోతాడు. అందరు అబ్బాయిలు చెడ్డవాళ్లు కాదు, అందర్నీ అనడం సరికాదని చెప్తాడు మరో యువకుడు.
ఏదేమైనా నీలా ధైర్యంగా సమస్యను ఎదుర్కొనే అమ్మాయిలుగా అందరూ ఉండాలంటూ ఆమెకు సెల్యూట్ చేస్తాడు ఆ యువకుడు. కాగా, ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications