Projects: ప్రాజెక్టుల్లో పెరుగుతున్న నీటి మట్టం.. ఆనందంలో రైతన్నలు..
తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు వస్తోంది. 69 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు కాగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1075.70 అడుగులు 41.452 టీఎంసీలుగా ఉందని అధికారులు చెప్పారు. ఇటు నిజాంసాగర్ లో నీటినిల్వ 10 టీఎంసీలకు చేరింది. కడెం ప్రాజెక్ట్ ఇప్పటికే నిండిపోయింది. అటు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది.
ఎల్లంపల్లి గేట్లు ఎత్తడంతో పాటు ప్రాణహిత, ఇంద్రావతితో గోదావరిలో భారీగా పెరిగింది. కాళ్వేశ్వరం నిండిపోవడంతో కిందికి నీటిని వదులుతున్నారు. ఇన్ని రోజులు వందల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసిన నీరు మళ్లీకి కిందికి వెళ్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నీరు చేరుతోంది. నిజాంసాగర్ లో నీటి నిల్వ 10 టీఎంసీలకు చేరింది. హిమాయత్ సాగర్ కూడా పూర్తిగా నిండిపోయింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. దీంతో మూసీ చుట్టపక్కలవారిని అలర్ట్ చేశారు.

హుస్సేన్ సాగర్ కూడా నిండిపోవడంతో నీటిని కిందికి వదులుతున్నారు. వికారాబాద్ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడంతో చెరువులు, ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. అయితే కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు మాత్రం వరద నీరు రావడం లేదు. మూసీ నుంచి కృష్ణాలోకి ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల కు వరద తాకిడి తక్కువగా ఉంది. ప్రాజెక్టుల్లో నీరు చేరుతుండడంతో అన్నదాతలు వరి సాగు పెంచారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలోని మెడోస్ విల్లాస్ కాలనీని మురుగు నీటితో నిండిపోయింది. బంగాళాఖాతంలో అల్పపీడనంత సోమవారం నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications